Site icon HashtagU Telugu

Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కు లైన్ క్లియర్ అయినట్టేనా ?

Mohammed Siraj And Bhuvneshwar Kumar

Mohammed Siraj And Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar: టీమిండియా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. గత కాలంగా సిరాజ్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపొతున్నాడు. శ్రీలంక టూర్లో పేసర్ బుమ్రా లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా స్థానం సిరాజ్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా జరిగిన శ్రీలంక టూర్లో సిరాజ్ వికెట్లు తీయడంలో వెనకబడ్డాడు. నిరంతర వైఫల్యం కారణంగా జట్టులో అతని స్థానం ముఖ్యంగా వన్డే, టీ20 ఫార్మాట్లలో ముప్పు పొంచి ఉంది. గంభీర్‌ కోచ్‌గా మారిన తర్వాత ఈ ప్రమాదం మరింత పెరిగి ఫామ్‌ మెరుగుపడకుంటే జట్టు నుంచి తప్పించే పరిస్థితి ఏర్పడింది.

మహ్మద్ సిరాజ్ స్థానంలో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. భువీ పొట్టి ఫార్మాట్‌లలో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ భువిపై కన్నేసింది. తాజాగా భువికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. భువనేశ్వర్ కుమార్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. భువీ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి భువనేశ్వర్ బౌలింగ్​ ఎప్పటికీ అల్టిమేట్ అనే చెప్పాలి. కాకపోతే గాయాల కారణంగా మనోడిలో వేగం, పదును తగ్గింది.మునుపటి స్థాయిలో స్వింగ్​ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ వంటి యంగ్ గన్స్ టీమ్​లోకి దూసుకురావడంతో భువీకి ప్లేస్ దక్కలేదు. ఐపీఎల్​లో రాణించినా అతడ్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. అయినా భువనేశ్వర్ మాత్రం ఆశలు చంపుకోలేదు. తిరిగి భారత జట్టులోకి కమ్​బ్యాక్ ఇవ్వడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్స్​లో బౌలింగ్ సాధన చేస్తూనే జిమ్​లో వర్కౌట్లు చేస్తూ చెమటోడ్చుతున్నాడు.

భువనేశ్వర్ కుమార్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 22 నవంబర్ 2022న న్యూజిలాండ్‌తో ఆడాడు. అప్పటి నుంచి అతను నిరంతరం జట్టుకు దూరమవుతున్నాడు. యువ బౌలర్లకు అవకాశాలు వస్తున్నా భువీకి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. స్వింగ్ బౌలింగ్‌లో పేరొందిన భువనేశ్వర్ కుమార్ 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 87 టీ20ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ వయస్సు దాదాపు 33 సంవత్సరాలు. అయినప్పటికీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అతనిలో 3-4 ఏళ్ల క్రికెట్ మిగిలి ఉందని విశ్లేషకులు అంటుంటారు. ఒకవేళ అతను పునరాగమనం చేస్తే కచ్చితంగా పరిమిత ఓవర్లలో నిరాశాజనకంగా రాణిస్తున్న సిరాజ్ ఔటవ్వాల్సి రావచ్చు.

Also Read: Stanford University : తెలంగాణ ప్రభుత్వం పనిచేసేందుకు ముందుకు వచ్చిన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ