Site icon HashtagU Telugu

Bhuvneshwar Kumar: టీమిండియా జట్టులోకి భువనేశ్వర్?

Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar: టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఉత్తరప్రదేశ్ తరపున బరిలోకి దిగిన భువనేశ్వర్ బెంగాల్ బ్యాటర్లను వణికించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్‍లో సత్తా చాటి తొలి రోజే ఐదు వికెట్లతో అదరగొట్టాడు.రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్, బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన ఉత్తర ప్రదేశ్ 60 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బెంగాల్ బ్యాటింగ్‍కు దిగింది. ఉత్తర ప్రదేశ్ తరఫున బౌలింగ్‍కు దిగిన భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. 13 ఓవర్లు వేసి 5 వికెట్లు పడగొట్టాడు.

టీమిండియా ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ఆడుతుంది. ఈ సిరీస్ అనంతరం భారత్ ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25న మొదలుకానుంది. ఈ తరుణంలో రంజీలో ఐదు వికెట్లతో సత్తా చాటిన భువీ ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు క్రికెట్‍కు తాను సిద్ధంగా ఉన్నానని భారత సెలెక్టర్లకు హింట్ ఇచ్చాడు. అటు బీసీసీఐ కూడా భువిని పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ కు షమీ గాయం కారణంగా దూరం కావడంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అలాగే భారత యువ బౌలర్లు కూడా టెస్టుల్లో అంతగా ప్రభావం చూపలేకున్నారు. ఈ తరుణంలో భువీని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భువీ సత్తా చాటడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భువీ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాన్నాళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‍ లో భువనేశ్వర్ ఐదు వికెట్లతో సత్తాచాటడంతో టీమిండియా జట్టులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు టీమిండియా టెస్టు జట్టుకు భువీని తీసుకోవాలని సెలెక్టర్లను డిమాండ్ చేస్తున్నారు.

Also Read: INDIA Chairperson : ‘ఇండియా’ కూటమి ఛైర్ పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే.. వివరాలివీ..