Bhuvaneshwar Kumar:సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar Kumar) పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఫ్రాంచైజీ భువిని వేలంలో కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. కానీ అదీ జరగలేదు. దీంతో భువనేశ్వర్‌ను ఆర్సీబీ భారీ మొత్తానికి 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. భువనేశ్వర్ కుమార్ 2014 నుండి హైదరాబాద్ జట్టుతోనే ఉన్నాడు. 11 సంవత్సరాల తర్వాత భువీ జట్టును మారాల్సి వచ్చింది. 2016లో హైదరాబాద్ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో భువనేశ్వర్ కుమార్ ముఖ్య పాత్ర పోషించాడు. రెండుసార్లు పర్పుల్ క్యాప్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. తన స్వింగ్ తో మాయచేసే భువిని సన్ రైజర్స్ వదులుకోవడం వెనుక కారణాలేవైనా కానీ.. ఆ జట్టు తనను కాదన్నందుకు భువనేశ్వర్ కుమార్ చాలా బాధపడ్డాడు. తాజాగా ఎస్ఆర్ఎచ్ కు గుడ్ బై చెబుతూ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టాడు. దీనికి అభిమానులు స్పందిస్తూ కావ్యమరన్ ని ట్రోల్స్ చేశారు. ఇప్పుడు భువీ తన సొంత జట్టైనా హైదరాబాద్ పై ఎదురుదాడికి దిగాల్సి వచ్చింది.
భువనేశ్వర్ కుమార్ 2014- 2024 మధ్య హైదరాబాద్ తరుపున 135 మ్యాచ్‌లలో 157 వికెట్లు తీశాడు. 2014, 2016 మరియు 2017 సీజన్లు అతనికి బాగా కలిసొచ్చాయి. ఈ కాలంలో అతను వరుసగా 20, 23, 26 వికెట్లు తీశాడు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టైటిల్ విజయంలో భువీ కీలక పాత్ర పోషించాడు. 2016 మరియు 2017లో వరుసగా రెండు సంవత్సరాలు పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ఇస్తారన్న విషయం తెలిసిందే. కాగా భువీ ఆర్సీబీ తరుపున చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.
Also Read: Pink Ball Most Wickets: రెండో టెస్టు.. టీమిండియాకు ముప్పుగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్!
భువనేశ్వర్ 2011 నుంచి 2024 మధ్య 176 మ్యాచ్‌లలో 181 వికెట్లు తీశాడు. మరో 19 వికెట్లు తీస్తే 200 వికెట్లు పడగొట్టి లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డులకెక్కవచ్చు. భువీ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. యజ్వేంద్ర చాహల్ 160 మ్యాచ్‌ల్లో 205 వికెట్లతో మొదటి స్థానంలో, పీయూష్ చావ్లా 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లతో రెండో స్థానంలో, బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 2014లో సన్ రైజర్స్ జట్టులో చేరడానికి ముందు భువనేశ్వర్ కుమార్ 2009 నుండి 2010 వరకు ఆర్సీబీలో మరియు 2011 నుండి 2013 వరకు పూణే వారియర్స్‌కి ప్రాతినిధ్యం వహించాడు.