IPL 2024: చెన్నై-హైదరాబాద్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు

ఐపీఎల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని కొందరు సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించారు.

IPL 2024: ఐపీఎల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని కొందరు సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించారు. మోసగాళ్లు వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్‌లను వినియోగదారులతో పంచుకుంటున్నారు. టిక్కెట్లను రూ.1,000 కంటే తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మిస్తున్నారు. ఇది నమ్మిన కొందరు క్రికెట్ అభిమానులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా భారీగా నష్టపోతున్నారు. సైబర్ మోసగాళ్లను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ మోసగాళ్ల బారిన పడకుండా నిరోధించాలని ప్రజలకు సూచించారు. సంబంధిత బుకింగ్ యాప్స్ ద్వారా మాత్రమే టికెట్లను కొనుగోలు చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ లీగ్ మ్యాచ్ లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టిక్కెట్‌ల విషయంలో ఎంతైనా చెల్లించేందుకు సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు అభిమానుల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే బ్లాక్ లో టికెట్లు పొందాలన్న కొందరు ఫ్యాన్స్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి భారీగా మోసపోతున్నారు.

Also Read: KTR : మీడియా, యూట్యూబ్ ఛానెల్స్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు