Site icon HashtagU Telugu

CSK Ben Stokes: స్వదేశానికి చెన్నై స్టార్ ఆల్ రౌండర్

CSK all-rounder Ben Stokes To Return Home, Won't Play Even If Csk Reach Ipl 2023 Play Offs

Ben Stokes To Return Home, Won't Play Even If Csk Reach Ipl 2023 Play Offs

CSK All-Rounder Ben Stokes : ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా… మిగిలిన మూడు బెర్తుల కోసం ఏడు జట్లు రేసులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ అవకాశం ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన చివరి మ్యాచ్ లో గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుంది. కాగా ప్లే ఆఫ్ స్టేజ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు (CSK) షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అందుబాటులో ఉండడం లేదు. చెన్నై చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన వెంటనే అతను స్వదేశానికి తిరిగి వెళ్ళిపోనున్నాడు.

ఐర్లాండ్ తో టెస్ట్ సీరీస్ , యాషెస్ సిరీస్ కు ప్రిపరేషన్ కోసం స్టోక్స్ వెళ్ళిపోతున్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై.. రూ. 16.25 కోట్లు వెచ్చించి బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేసింది. షేన్ వాట్సన్ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్న సీఎస్కే.. స్టోక్స్‌ను దక్కించుకుంది. ఈ సీజన్ లో అతడు ఆల్ రౌండర్ గా సేవలందిస్తాడని భావించింది. అయితే స్టోక్స్‌ గాయం కారణంగా కేవలం బ్యాటింగ్ కే పరిమితం అయ్యాడు. అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

ఈ సీజన్ లో స్టోక్స్ ఇప్పటివరకు కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.రెండు మ్యాచ్‌లలో, అతను కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చాడు. మిగిలిన మ్యాచ్‌లలో, స్టోక్స్ గాయం కారణంగా బెంచ్‌పై కూర్చున్నాడు.

ఇప్పుడు జట్టు ఎంపికకు అతను అందుబాటులో ఉన్నా చోటు దక్కడం డౌటే. జట్టులో ఇప్పటికే డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, మహిష్ తీక్షణ, మతిషా పతిరనా రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు నలుగురు ఆటగాళ్లు జట్టుకు మంచి ప్రదర్శన చేశారు. ఈ విధంగా చూస్తే బెన్ స్టోక్స్‌కు జట్టులో చోటు దక్కేలా కనిపించడం లేదు. దీంతో ప్లే ఆఫ్ మ్యాచ్ లకు అతన్ని ఉండమని రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదని చెప్పొచ్చు.

Also Read:  ICC Three Rules : జూన్ 1 విడుదల ..ఐసీసీ 3 రూల్స్‌ లో మార్పు