Site icon HashtagU Telugu

Ashes Series 2023: ఢిల్లీ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లనున్న బెన్ స్టోక్స్

Ashes Series 2023

New Web Story Copy 2023 05 16t154853.846

Ashes Series 2023: ఫిట్నెస్ సమస్యతో సతమతమవుతున్న ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఈ సీజన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు. ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ బెన్ స్టోక్స్ ని రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో స్టోక్స్ కేవలం చెన్నైకి రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. కాగా.. ఇంగ్లాండ్ త్వరలో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఇందుకు గానూ స్టోక్స్ తమ దేశానికి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు సమయం కావాలని, ఆస్ట్రేలియాతో సిరీస్ ఉన్నందున స్వదేశానికి వెళ్లేందుకు పర్మిషన్ కోరాడు.

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో స్టోక్స్ 7 పరుగులు, రెండో మ్యాచ్‌లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో స్టోక్స్ బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చాడు. జూన్ 16న ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడిన తర్వాత స్టోక్స్ ఇంగ్లాడ్ కు బయలుదేరుతాడు. మరోవైపు జూన్ 1న లార్డ్స్‌లో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ టెస్టు ఆడనుంది.

స్టోక్స్ ఫామ్ లో లేనప్పటికీ అతని లోపం స్పష్టంగా కనిపిస్తుంది చెన్నై జట్టులో. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. అయితే ఆ మ్యాచ్ తర్వాత స్టోక్స్ లేకపోవడం చెన్నై జట్టుకు పెద్ద దెబ్బ తగిలేనట్టేనని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతుంది. చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ సత్తా చాటుతుంది. పాయింట్ల పట్టికలో హార్దిక్ పాండ్య జట్టు ముందంజలో ఉండగా.. రెండో స్థానాల్లో ధోని సేన స్థానం దక్కించుకుంది. మరోవైపు టైటిల్ ఫేవరేట్ గా ఉండే ముంబై ఇండియన్స్ తడబడుతుంది. 12 మ్యాచ్ లు ఆడిన ముంబై 7 మ్యాచులు గెలిచి 5 మ్యాచులు ఓడి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతుంది.

Read More: Tamannaah and Chiru: చిరు కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లిన తమన్నా, ఎందుకో తెలుసా!