Ben Duckett Century : రాజ్ కోట్ లో భారత్ భారీస్కోరు..ధీటుగా జవాబిస్తున్న ఇంగ్లాండ్

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 05:42 PM IST

భారత్, ఇంగ్లాండ్ (England Vs India) మధ్య మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి. తొలి రెండు సెషన్లలో బ్యాటింగ్ చేసిన భారత్ భారీస్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. జడేజా 112 పరుగుకు ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందనిపించింది. అయితే ధృవ్ జురెల్, అశ్విన్ కీలక పార్టనర్ షిప్ తో భారీస్కోరు అందించారు. అరంగేట్రంలో జురెల్ కూడా ఆకట్టుకున్నాడు. అశ్విన్ తో కలిసి 77 పరుగులు జోడించాడు. అశ్విన్ 37 , జురెల్ 46 పరుగులకు ఔటవగా… చివర్లో బూమ్రా దూకుడుగా ఆడి స్కోర్ 440 దాటించాడు. ఎటాకింగ్ బ్యాటింగ్ చేసిన బూమ్రా 26 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4 వికెట్లు తీశాడు.

We’re now on WhatsApp. Click to Join.

తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది, బజ్ బాల్ కాన్సెప్ట్ తో మరోసారి వేగంగా పరుగులు చేశాడు. ఓపెనర్లు తొలి వికెట్ కు 13 ఓవర్లలోనే 89 పరుగులు జోడించగా… బెన్ డకెట్ బౌండరీలతో చెలరేగిపోయాడు. కేవలం 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓలే పోప్ 39 రన్స్ కు ఔటవగా… రూట్ తో కలిసి డకెట్ తన జోరు కొనసాగించాడు. ఫలితంగా భారత్ భారీస్కోరుకు ధీటుగా బదులిస్తోన్న ఇంగ్లాండ్ రెండోరోజు ఆటముగిసే సమయానికి 35 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. డకెట్ 133 , రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడోరోజు తొలి సెషన్ లోనే వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను కట్టడి చేస్తే మ్యాచ్ లో భారత్ పట్టుబిగించే అవకాశముంటుంది.

Read Also : Lokesh : జగన్ కు ‘కుర్చీని మడతపెట్టి’ మరి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్