Site icon HashtagU Telugu

Mohammad Siraj: టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం!

Mohammad Siraj

Mohammad Siraj

Mohammad Siraj: రేపటి నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆడేందుకు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా శ్రీలంక చేరుకుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియా 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వేను 4-1తో ఓడించింది. ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో శ్రీలంకను ఓడించడం టీమ్‌ఇండియాకు సవాల్‌గా మారింది. ఈ సిరీస్ ప్రారంభం కాకముందే టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది.

స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు

రేపటి నుంచి శ్రీలంకతో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. అయితే అంతకు ముందు టీమమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో మహ్మద్ సిరాజ్ కుడి కాలికి గాయమైంది. గాయం తర్వాత నొప్పితో బాధ‌ప‌డుతూ కనిపించాడు. వెంటనే అక్క‌డ ఉన్న వైద్యుల బృందం మహ్మద్ సిరాజ్‌కు ప్రథమ చికిత్స అందించినప్పటికీ మహ్మద్ సిరాజ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా స్టార్ బౌలర్ శ్రీలంకతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో ఆడుతాడా లేదా? అనే దానిపై అనుమానం వ్య‌క్తం అవుతుంది.

Also Read: Olympics Opening Ceremony: నేటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం.. బ‌రిలో 117 మంది భార‌త అథ్లెట్లు..!

మహ్మద్ సిరాజ్ కీ రోల్‌

శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. ఈ పర్యటనలో, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌కు నాయకత్వం వహించాల్సి ఉంది. అయితే సిరాజ్ గాయం జట్టు క‌ష్టాల‌ను పెంచేలా ఉంది. శ్రీలంక పర్యటన కోసం ప్రకటించిన టీ20, వన్డే సిరీస్‌లకు మహ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి ఎంపికయ్యాడు.

We’re now on WhatsApp. Click to Join.

సిరాజ్ అందుబాటులో లేకుంటే!

మహ్మద్ సిరాజ్‌తో పాటు సెలెక్టర్లు శ్రీలంకతో జరిగే జట్టులో అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్‌లను కూడా ఎంపిక చేశారు. గాయం కారణంగా మహ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకుంటే ఖలీల్ అహ్మద్‌ను ప్లే-11లో చేర్చి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌కు నాయకత్వం వహించవచ్చని తెలుస్తోంది. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా వారికి సహాయం చేస్తారు. రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ బౌలింగ్ బాధ్య‌త‌లు చూసుకోనున్నారు.

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్

 

 

Exit mobile version