Site icon HashtagU Telugu

BCCI : ఉప్పల్ స్టేడియంపై బీసీసీఐ చిన్న చూపు

Uppal Bcci

Uppal Bcci

హైదరాబాద్‌(Hyderabad)లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)పై బీసీసీఐ(BCCI) మరోసారి చిన్న చూపు చూసింది. 2025 అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేసిన బీసీసీఐ, విండీస్ మరియు దక్షిణాఫ్రికా సిరీస్‌ల కోసం స్టేడియంలను ప్రకటించినప్పటికీ, ఉప్పల్ స్టేడియంకు చోటు దక్కలేదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా అనేక స్టేడియాలను ఎంపిక చేసిన బీసీసీఐ, హైదరాబాద్‌కు మాత్రం మొగ్గుచూపలేదు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌కు క్రికెట్ పరంగా విశేష ప్రాధాన్యం ఉంది. ఐపీఎల్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ హోమ్ గ్రౌండ్‌గా ఉప్పల్ స్టేడియాన్ని వినియోగించుకుంటున్నా, అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయంలో మాత్రం పట్టించుకోకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే అంశం. ఈసారి సౌతాఫ్రికాతో మూడో వన్డే కోసం విశాఖపట్నాన్ని మాత్రమే ఎంపిక చేయడం, హైదరాబాద్‌ను పక్కన పెట్టడం వివాదాస్పదంగా మారింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడంతో ఇది బీసీసీఐ ఉద్దేశపూర్వక నిర్ణయమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఉప్పల్ స్టేడియం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. ఆధునిక సదుపాయాలు, విస్తృతమైన ప్రేక్షకగాలరీలు కలిగిన ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంచడాన్ని కొంతమంది మానసిక కక్షగా అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కూడా ఈ వ్యవహారంపై స్పందించి, బీసీసీఐతో చర్చలు జరిపి, ఉప్పల్ స్టేడియంకు గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. లేదంటే హైదరాబాద్‌కు ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడనుంది.

Doddi Komurayya: వీర యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి.. పోరాట విశేషాలివీ