BCCI and IPL:విదేశీ లీగ్స్‌లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీల ఎంట్రీ

ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే.

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 04:02 PM IST

ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. ఆటగాళ్ళ నుంచి బీసీసీఐ వరకూ.. స్పాన్సర్ల నుంచి బ్రాడ్‌కాస్టర్ల వరకూ కాసుల వర్షం కురిపించింది. అన్నింటికీ మించి విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దేశాలతో సంబంధం లేకుండా ఐపీఎల్‌కు ఆదరణ దక్కింది. ఈ క్రేజ్ కారణంగానే ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు అదే బ్రాండ్ వాల్యూతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్స్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నాయి. ఐపీఎల్ స్ఫూర్తితో ప్రారంభమవుతున్న సౌతాఫ్రికా, యూఏఈ క్రికెట్ లీగ్స్‌లో మేజర్ టీమ్స్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేశాయి. ప్రస్తుతం విదేశీ లీగ్స్‌లో తమ జట్ల ప్రమోషన్స్‌లో ఆయా ఫ్రాంచైజీలు బిజీగా ఉన్నాయి. ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ ముంబై ఇండియన్స్‌. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు ఈ మెగా లీగ్‌ టైటిల్‌ గెలిచింది. రిలయెన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి చెందిన ఈ టీమ్‌ బ్రాండ్ వాల్యూ తారాస్థాయిలో ఉంది. తాజాగా ఈ ఫ్రాంఛైజీ అటు సౌతాఫ్రికా, ఇటు యూఏఈల్లో జరగబోయే టీ20 లీగ్స్‌లోని టీమ్స్‌నూ కొనుగోలు చేసింది. క్రికెట్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కొనుగోలు చేసిన టీమ్‌కు ఎంఐ కేప్‌టౌన్‌గా, యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో కొన్న టీమ్‌కు ఎంఐ ఎమిరేట్స్‌ అనే పేర్లు పెట్టింది. వీటికి సంబంధించి కొన్ని వీడియోలను కూడా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. మా ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చిన ఎంఐ ఎమిరేట్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌లకు వెల్‌కమ్ చెప్పడానికి సంతోషిస్తున్నానంచూ రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ నీతా అంబానీ ట్వీట్ చేశారు.
ఫ్రాంచైజీల పేర్లతో పాటు అందులో పాల్గొననున్న ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్‌ జెర్సీలను ఆటగాళ్లు ధరించనున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీ బ్లూ, గోల్డ్ లతో కలగలిసిన దుస్తులే యూఏఈ, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లలో కనిపించనున్నారు. కేవలం లోగో మాత్రమే మారనుంది. ఈ మేరకు ముంబై ఇండియన్స్.. తన ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
సీఎస్‌ఏ టి20 లీగ్‌లో మొత్తం ఆరుజట్లు ఉండగా.. అన్నింటిని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజాగా కేప్‌టౌన్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌.. ముంబై కేప్‌టౌన్‌గా నామకరణం చేసింది. ఇక మిగతా జట్లను పరిశీలిస్తే జొహన్నెస్‌బర్గ్‌ను సీఎస్‌కే, సెంచూరియన్‌, పార్ల్‌, డర్బన్‌,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌,లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకున్నాయి.