Site icon HashtagU Telugu

RCB vs KKR Match: ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్‌లో భార‌త సైన్యం కోసం బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం!

RCB vs KKR Match

RCB vs KKR Match

RCB vs KKR Match: నేటి నుంచి ఐపీఎల్ 2025 2.0 ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ- కేకేఆర్ మధ్య సీజన్‌లోని 58వ మ్యాచ్ (RCB vs KKR Match) జరగనుంది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఐపీఎల్‌ను ఒక వారం పాటు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు మళ్లీ మే 17 నుంచి ఐపీఎల్ జోరుగా మొదలు కానుంది. ఆర్‌సీబీ- కేకేఆర్ మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు బీసీసీఐ కూడా ఒక కీల‌క నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత సైన్యానికి ప్రత్యేక గౌరవం ఇవ్వనున్నారు.

భారత సైన్యానికి గౌరవం

ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్ ప్రారంభానికి 5 నిమిషాల ముందు భారత సైన్యానికి ప్రత్యేక గౌరవం ఇవ్వనున్నారు. మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ 7:25 గంటలకు జాతీయ గీతం ఆలపించబడుతుంది. ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కూడా జాతీయ గీతంలో పాల్గొంటారు. దేశం మొత్తాన్ని గర్వించేలా చేసిన భారత సైన్యం కోసం బీసీసీఐ ఈ వేడుకను ఏర్పాటు చేసింది.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. దీనిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ భారతదేశంలోని పలు నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీకి భారీ షాక్‌ల‌ను ఇచ్చింది.

ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్ర‌క‌టించారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత సైన్యం కోసం ప్రత్యేక చర్య తీసుకుంది.

Also Read: RCB vs KKR Match: ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్‌లో భార‌త సైన్యం కోసం బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం!

అభిమానుల ఉత్సాహం

బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్‌లో అభిమానుల సందడి కనిపించనుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మొదటిసారి ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నాడు. అభిమానులు విరాట్‌ను చూడటానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.