Site icon HashtagU Telugu

World Cup Tickets: 400,000 టిక్కెట్‌లను విడుదల చేయనున్న బీసీసీఐ

World Cup

New Web Story Copy 2023 09 06t225911.629

World Cup Tickets: ప్రపంచ కప్ మేనియా నడుస్తుంది. పట్టుమని నెల కూడా లేకపోవడంతో క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ లను నేరుగా చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టికెట్ల విషయంలో బీసీసీఐపై ఫ్యాన్స్ గరం అవుతున్నారు. బ్లాక్ లో కొందరు లక్షల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ప్రపంచ కప్ టోర్నీ కోసం దాదాపు 400,000 టిక్కెట్‌లను విడుదల చేయనుంది. అయితే విడుదల చేసిన 400,000 టిక్కెట్లలో ఎంత శాతం భారత మ్యాచ్‌ల కోసం ప్రత్యేకంగా కేటాయించబడుతుందో బోర్డు చెప్పలేదు. ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఔత్సాహికులు ఈ సంవత్సరం క్రికెట్ మహాసంగ్రామాన్ని చూసేందుకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 8న రాత్రి 8:00 గంటల నుండి అన్ని మ్యాచ్‌ల టిక్కెట్‌ల సాధారణ విక్రయం ప్రారంభమవుతుంది. అభిమానులు అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్ https://tickets.cricketworldcup.comని సందర్శించడం ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

Also Read: Transgenders: ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.1000 ఫించన్