India Squad: దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే, టీ20 సిరీస్‌లలో ఘనవిజయం సాధించిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. 2026 ఏడాదిని భారత జట్టు కివీస్‌తో పోరుతోనే ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించి మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి తమ బ్యాటింగ్ పవర్‌ను చూపేందుకు సిద్ధమవుతున్నారు. గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సిరీస్‌లో ఆయనే జట్టును నడిపించనున్నారు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
Also Read: రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!
జట్టును ఎప్పుడు ప్రకటిస్తారు?
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టును జనవరి 3 లేదా 4 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో గాయం కారణంగా వన్డేలకు దూరమైన శుభ్‌మన్ గిల్ ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు. ఆయన వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
Also Read: చిరు-వెంకీల మెగా విక్టరీ మాస్ సాంగ్.. డిసెంబర్ 30న విడుదల!
దక్షిణాఫ్రికాలో అదరగొట్టిన భారత్
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ చెలరేగిపోయారు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో దుమ్మురేపారు. రోహిత్ శర్మ తనదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు శుభారంభాలు ఇచ్చారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మ్యాజిక్ చేశాడు. 3 మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. అదే ఊపును న్యూజిలాండ్‌పై కూడా కొనసాగించి 2026 ఏడాదిని ఘనంగా ప్రారంభించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
