ICC Test Rankings: అశ్విన్ పై జైషా ప్రశంసలు

భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టెస్టు సిరీస్‌లో భారత స్పిన్ బౌలర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనకు ఐసీసీ నుంచి భారీ పారితోషికం కూడా అందుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Icc Test Rankings

Icc Test Rankings

ICC Test Rankings: భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టెస్టు సిరీస్‌లో భారత స్పిన్ బౌలర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనకు ఐసీసీ నుంచి భారీ పారితోషికం కూడా అందుకున్నాడు.

బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచాడు. దీంతో అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బీసీసీఐ కూడా అశ్విన్ ని పొగడ్తలతో మంచెత్తింది. బీసీసీఐ సెక్రటరీ జయ్ షా అశ్విన్ ని ప్రశంసించాడు. నిజానికి ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ 26 వికెట్లు పడగొట్టాడు . ఈ టెస్ట్ సిరీస్‌లో అతను తన 100వ టెస్ట్ మ్యాచ్‌ని కూడా ఆడాడు. ఇందులో అతను మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత అశ్విన్ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించడం ద్వారా అశ్విన్ టెస్ట్ నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్‌కు మొత్తం 870 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానానికి పడిపోయాడు.

అశ్విన్ ని బీసీసీఐ సెక్రటరీ జైషా అభినందించారు. ఆరోసారి టెస్ట్ నంబర్ 1 బౌలర్ అయినందుకు అశ్విన్‌కు అభినందనలు అని ఎక్స్ లో రాసుకొచ్చాడు.మీ స్థిరమైన అద్భుతమైన ప్రదర్శనలు మా అందరికీ స్ఫూర్తి అంటూ కొనియాడారు.

Also Read: Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ సస్పెన్స్ వీడేది ఆరోజే..!

  Last Updated: 14 Mar 2024, 12:38 PM IST