Site icon HashtagU Telugu

BCCI: టీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గుడ్ న్యూస్‌.. ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చు!

WTC Final Host

WTC Final Host

BCCI: ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లపై పలు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ సిరీస్ తరువాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆటగాళ్లందరికీ ఎటువంటి సిరీస్ లేదా ICC ఈవెంట్‌ల కోసం ఏ ఆటగాడి కుటుంబం వారితో ప్రయాణించకూడదని ఆదేశాలు జారీ చేసింది. గతంలో చాలా మంది క్రికెటర్ల భార్యలు, కొంతమంది కుటుంబ సభ్యులను త‌మ‌తో పాటు మ్యాచ్‌ల‌కు తీసుకువ‌చ్చేవారు. కానీ ఇప్పుడు అలా తీసుకురావ‌డం కుద‌ర‌దు. అయితే బీసీసీఐ ఇప్పుడు క్రికెటర్ల కుటుంబాలకు శుభవార్త అందించాలనే ఆలోచనలో ఉంది.

క్రికెటర్ల కుటుంబాలు దుబాయ్ వెళ్లొచ్చు

ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో ఆడబోతోంది. దీని కోసం ఈసారి టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ భార్యలు, కుటుంబాలు లేకుండా దుబాయ్ చేరుకున్నారు. అయితే ఇప్పుడు భారత క్రికెటర్లు తమ కుటుంబాలను ఒక మ్యాచ్ కోసం దుబాయ్‌కు తీసుకెళ్లవచ్చని వార్తలు వస్తున్నాయి.

Also Read: Ranveer Allahbadia : ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..?: యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఒక ఆటగాడు తన కుటుంబాన్ని దుబాయ్‌కి తీసుకెళ్లాలనుకుంటే అతను ఒక మ్యాచ్ కోసం మాత్రమే తీసుకురాగలడని BCCI మూలం తెలిపింది. ఇందుకోసం వారు బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బీసీసీఐ అనుమతిస్తే క్రికెటర్ల కుటుంబాలు వారితో కలిసి దుబాయ్‌కి రావచ్చు. ఈ విషయమై టీమ్ మేనేజ్‌మెంట్ అధికారి బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియాతో మాట్లాడారు. అదే సమయంలో దీనికి సంబంధించిన సమాచారం ఇంకా వెల్లడించలేదు. దీని కోసం టీమిండియా ఆట‌గాళ్లు బీసీసీఐ నుండి అనుమతి కోరాలా వ‌ద్దా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

బీసీసీఐ కొత్త విధానం ఏమిటి?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత బీసీసీఐ కొత్త ట్రావెల్ పాలసీని రూపొందించింది. దీని ప్రకారం టీమ్ ఇండియా ఏదైనా పర్యటన 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగితే ఆటగాళ్ళు తమ భార్య, పిల్లలను 2 వారాల పాటు తమతో ఉంచుకోవచ్చు. ఇది కాకుండా పర్యటన తక్కువగా ఉంటే ఒక వారం పాటు కుటుంబంతో కలిసి ఉండ‌వచ్చు. ఒక ఆటగాడు బీసీసీఐ రూల్స్‌కు భిన్నంగా తన కుటుంబాన్ని ఎక్కువ కాలం తన వద్ద ఉంచుకుంటే ఆటగాళ్లు కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్ నుండి అనుమతి తీసుకోవాలి. లేదా దాని కోసం అయ్యే ఖర్చులను ఆటగాళ్లు భరించాల్సి ఉంటుంది.