Site icon HashtagU Telugu

BCCI: బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న క్రికెటర్, బీసీసీఐ భారీ సాయం

BCCI

BCCI

BCCI: భారత మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా కోచ్ అన్షుమన్ గైక్వాడ్(Aunshuman Gaekwad) చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయ‌న లండ‌న్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ 71 ఏళ్ల ఈ క్రికెటర్ పరిస్థితిని చూసి కపిల్ దేవ్ తనకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కానీ తనకు కావాల్సిన సాయం ఒక్కరితో అయ్యేది కాదు కాబట్టి బీసీసీఐని ఆశ్రయించాడు. అన్షుమన్, నేను కలిసి ఆడాం. ఇప్పుడు అతన్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను. అతడి చికిత్సకు సహకరించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించారు కపిల్ దేవ్(Kapil Dev). అంతేకాదు అతని పెన్షన్‌ను కూడా విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

కపిల్ దేవ్ చొరవతో ఇతర మాజీ క్రికెటర్లు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇందులో మొహిందర్ అమర్‌నాథ్, సందీప్ పాటిల్, మదన్ లాల్ మరియు కీర్తి ఆజాద్ ఉన్నారు.ఇక మాజీలు అంత ఏకమవ్వడంతో బీసీసీఐ కూడా తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం కోటి రూపాయల నిధిని బీసీసీఐ విడుదల చేసింది. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అన్షుమాన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు తక్షణమే కోటి రూపాయలు విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ జే షా(Jay Shah) బోర్డును ఆదేశించారు. అంతే కాదు జై షా అన్షుమాన్ కుటుంబాన్ని కలుసుకుని ఓదార్చారు. గైక్వాడ్ ఆరోగ్యాన్ని బీసీసీఐ పర్యవేక్షిస్తుందని. అతను త్వరలో కోలుకుంటాడని కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిచ్చారు.

1974- 87 మధ్య అన్షుమాన్‌ గైక్వాడ్ భార‌త్‌ తరఫున 15 వన్డేలు, 40 టెస్టులు ఆడాడు. అనంత‌రం భార‌త జ‌ట్టుకు రెండు సార్లు ప్ర‌ధాన కోచ్‌గా ప‌నిచేశారు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించాడు. అతను కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

Also Read: Yuvraj Singh: ధోనీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్