Site icon HashtagU Telugu

India Jersey: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. పీసీబీకి షాకిచ్చిన బీసీసీఐ!

India Jersey

India Jersey

India Jersey: వచ్చే నెలలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి పెద్ద షాక్ తగిలింది. ఛాంపియ‌న్స్ టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియా తన జెర్సీపై (India Jersey) పాకిస్తాన్ పేరును ముద్రించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ టోర్నీలో భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడేందుకు అంగీకరించింది. అయినప్పటికీ టోర్నమెంట్‌కు అధికారిక హోస్ట్‌గా పాకిస్థాన్ ఇప్పటికీ కొనసాగుతోంది.

బీసీసీఐ రాజకీయాలు చేస్తోందని పీసీబీ ఆరోపించింది

ఈ విషయంపై పీసీబీ అధికారి ‘ఐఏఎన్‌ఎస్‌’తో మాట్లాడుతూ.. బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కెప్టెన్ల సమావేశానికి కెప్టెన్ రోహిత్ శర్మను పాకిస్తాన్‌కు పంపడానికి బీసీసీఐ నిరాకరించింది.

Also Read: Eatala Rajendar : ‘రియల్’ బ్రోకర్‌పై ఈటల రాజేందర్‌, అనుచరుల ఎటాక్.. ఎందుకు ?

‘రాజకీయాలు క్రీడలకు మంచిది కాదు’

పిసిబి అధికారి అజ్ఞాత షరతుపై బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకువస్తోంది. ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదు. పాకిస్థాన్ వ‌చ్చేందుకు నిరాకరించారు. ఓపెనింగ్ సెర్మనీకి తమ కెప్టెన్‌ని పాకిస్థాన్‌కు పంపడం ఇష్టం లేదన్నారు. ఇప్పుడు టీమిండియా జెర్సీపై ఆతిథ్య దేశం పేరును ముద్రించడం ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. ఐసీసీ దీనిని అనుమతించదని, పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తుందని నేను న‌మ్ముతున్నానని ఆయ‌న అన్నారు.

ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో పాక్‌ తలపడనుంది

ఈ సమస్యకు సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం టోర్నమెంట్‌లో ముఖ్యమైన భాగం కాబట్టి ICC అన్ని జట్లను సమానంగా చూసేలా చూడాలని PCB చెబుతోంది. దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో టోర్నీని ప్రారంభించనుండగా.. ఫిబ్రవరి 23న అదే మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది.