T20 Series : ప్రేక్షకులు లేకుండానే టీ ట్వంటీ సిరీస్

భారత క్రికెట్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్... సొంతగడ్డపై చాలా రోజుల తర్వాత తమ అభిమాన క్రికెటర్ల ఆటను ఆస్వాదిద్దామనుకున్న వారికి నిరాశే మిగలనుంది.

  • Written By:
  • Publish Date - February 5, 2022 / 04:08 PM IST

భారత క్రికెట్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్… సొంతగడ్డపై చాలా రోజుల తర్వాత తమ అభిమాన క్రికెటర్ల ఆటను ఆస్వాదిద్దామనుకున్న వారికి నిరాశే మిగలనుంది. వన్డే సిరీస్ తో పాటు టీ ట్వంటీ సిరీస్ కూ అభిమానులను అనుమతించడం లేదు. నిజానికి అహ్మాదాబాద్ వేదికగా జరగనున్న వన్డే సిరీస్ ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినా… టీ ట్వంటీ సిరీస్ కు ప్రేక్షకులను అనుమతిస్తారని భావించారు. 75శాతం సామర్థ్యంతో మ్యాచ్ లు నిర్వహించుకునేందుకు బెంగాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీ ట్వంటీ సిరీస్ ను చూడొచ్చని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. అయితే తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటకీ.. ఫ్యాన్స్ లేకుండానే మ్యాచ్ లు జరపనున్నట్టు చెప్పాడు. ప్రేక్షకుల ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టదలుచుకోలేదని దాదా వ్యాఖ్యానించాడు. టీ ట్వంటీ సిరీస్ కు కేవలం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రతినిధులకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని దాదా స్పష్టం చేశాడు. ఈ కారణంగానే ప్రేక్షకులకు టిక్కెట్లను కూడా విక్రయించలేదన్నాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా మూడు వన్డేల సిరీస్ ఆదివారం నుండి మొదలు కానుండగా… ఫిబ్రవరి 16 నుండి కోల్ కతాలో టీ ట్వంటీ సిరీస్ షురూ కానుంది.