BCCI: ఆదాయంలో ఐపీఎల్ ది బెస్ట్ అంటున్న దాదా

ఆదాయం విషయంలో ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమం లీగ్ అన్నాడు బీసీసీఐ చీఫ్ , మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ని మించి డబ్బులు ఇస్తుందని చెప్పాడు.

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 10:04 PM IST

ఆదాయం విషయంలో ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమం లీగ్ అన్నాడు బీసీసీఐ చీఫ్ , మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ని మించి డబ్బులు ఇస్తుందని చెప్పాడు. ఇంకా తన కెప్టెన్సీ తో పాటు భారత క్రికెట్ పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ ఈవెంట్‌లో గంగూలీ మాట్లాడుతూ.. క్రికెట్‌ ఈ స్థాయికి చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు.గేమ్‌ ఎంతలా మారిపోయిందో తాను చూశాననీ, ఒకప్పుడు తన లాంటి ప్లేయర్స్‌ వందల్లో సంపాదించాలని అనుకునేవాళ్లమనీ, కానీ ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారనీ చెప్పాడు.

ఈ గేమ్‌ను అభిమానులు, ఈ దేశ ప్రజలు, బీసీసీఐ నడిపిస్తోందన్నాడు. బీసీసీఐని కూడా క్రికెట్‌ అభిమానులే స్థాపించారునీ, ప్రస్తుతం ఈ స్పోర్ట్‌ చాలా స్ట్రాంగ్‌ అన్నాడు. ఇది ఇంకా మెరగవుతూనే ఉంటుందనీ, ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ కంటే కూడా ఐపీఎల్‌ ఎక్కువ ఆదాయం ఇస్తోందనీ దాదా వ్యాఖ్యానించాడు. తాను ప్రేమించిన ఆట ఇప్పుడీ స్థాయిలో బలంగా మారడం చూస్తుంటే సంతోషంగానూ, గర్వంగానూ ఉందని గంగూలీ అన్నాడు. ఇక లీడర్‌షిప్‌ స్టైల్‌ గురించి చెప్పమని అడిగితే.. దాదా తనదైన స్టైల్లో స్పందించాడు. కెప్టెన్సీ అంటే తన దృష్టిలో గ్రౌండ్‌లో టీమ్‌ను లీడ్‌ చేయడమనీ, లీడర్‌షిప్‌ అంటే ఓ టీమ్‌ను నిర్మించడమనీ విశ్లేషించాడు. తాను సచిన్‌, అజర్, ద్రవిడ్‌లాంటి వాళ్లతో కలిసి ఆడినప్పుడు వాళ్లతో పోటీ పడలేదనీ, బదులుగా వాళ్లతో లీడర్లుగా కలిసి పని చేశాననీ, బాధ్యతలు పంచుకున్నానని గంగూలీ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటంలో కామన్‌గా ఉన్న పాయింట్‌ ఏంటి అని అడిగితే దాదా సూటిగా స్పందించాడు. రెండింట్లోనూ వ్యక్తులను మేనేజ్‌ చేయడమే కామన్‌ విషయమన్న దాదా ఈ దేశంలో అద్భుతమైన టాలెంట్‌ ఉందన్నాడు. అది ప్లేయర్స్‌ అయినా ఉద్యోగులైనా ఓ సక్సెస్‌ఫుల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండాలనుకుంటే సహచరులను గౌరవించాలని, అలా అయితే వాళ్లు మంచి ప్లేయర్స్‌గా ఎదుగుతారన్నాడు. అన్నీ మీ దగ్గరే పెట్టుకొని మంచి జరగాలంటే జరగదని గంగూలీ వ్యాఖ్యానించాడు.