BCCI President: బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో కొత్త పేరు.. ఎవ‌రంటే..?

అక్టోబ‌ర్ 18వ తేదీతో బీసీసీఐ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శుల ప‌ద‌వీకాలం ముగియనుండ‌టంతో కొత్త‌గా ఎవ‌రిని ఎన్నుకంటార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 12:19 AM IST

అక్టోబ‌ర్ 18వ తేదీతో బీసీసీఐ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శుల ప‌ద‌వీకాలం ముగియనుండ‌టంతో కొత్త‌గా ఎవ‌రిని ఎన్నుకంటార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుత కేంద్ర‌మంత్రి అమిత్ షా కుమారుడు జైషా త‌దుప‌రి అధ్య‌క్షుడిని కొంత‌కాలంగా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తోన్నాయి. తాజాగా మ‌రో కొత్త పేరు బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులోకి వ‌చ్చింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ రోజ‌ర్ బిన్నీ బీసీసీఐ అధ్య‌క్ష రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వార్షిక సాధార‌ణ స‌మావేశంలో ఆయ‌న పేరు క‌నిపించ‌డ‌మే అందుకు కార‌ణం.

అయితే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కొన్నిరోజుల క్రితం నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇందులో భాగంగా ఈనెల 4వ‌ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. అక్టోబర్‌ 18వ తేదీన ఫలితాలను వెల్లడించ‌నున్నారు.

రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ. భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ 1983 ప్రపంచ కప్‌లో మొత్తం 18 వికెట్లు సాధించి, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిల్చాడు. 1985లో వరల్డ్ సీరీస్ క్రికెట్ చాంపియన్‌లో కూడా ఇదే ప్రతిభ ప్రదర్శించి 17 వికెట్లు సాధించాడు.

72 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన బిన్నీ 16.12 సగటుతో మొత్తం 629 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ ఉంది. వన్డేలో అతని అత్యధిక స్కోరు 57 పరుగులు. బౌలింగ్ లో 29.35 సగటుతో 77 వికెట్లు సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ 29 పరుగులకు 4 వికెట్లు.

రోజర్ బిన్నీ భారత్ తరపున 27 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 23.05 సగటుతో 830 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 83 నాటౌట్. బౌలింగ్ లో 32.63 సగటుతో 47 వికెట్లు సాధించాడు. రెండు సార్లు ఇన్నింగ్సులో 5 వికెట్లు సాధించిన ఘనత పొందాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ 56 పరుగులకు 6 వికెట్లు.