Site icon HashtagU Telugu

Golden Ticket To Rajnikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన బీసీసీఐ..!

Golden Ticket To Rajnikanth

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Golden Ticket To Rajnikanth: 2023 ప్రపంచకప్‌కు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుండి భారతదేశంలో మొదలు కానుంది. ఈ టోర్నీలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక చొరవను ప్రారంభించింది. భారత్‌లోని గొప్ప స్టార్లకు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్లు ఇస్తోంది. ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌, సచిన్‌ టెండూల్కర్‌లకు బోర్డు గోల్డెన్‌ ఇచ్చింది.

ఇప్పుడు ఈ జాబితాలోకి సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా చేరింది. రజనీకాంత్‌ (Golden Ticket To Rajnikanth)కు బీసీసీఐ సెక్రటరీ జై షా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేసింది. ఇందులో రజనీకాంత్‌కి జై షా గోల్డెన్ టికెట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘గౌరవనీయులైన బీసీసీఐ సెక్రటరీ జై షా రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చి సత్కరించారు’ అని ఫోటోతో పాటు క్యాప్షన్ రాసింది.

Also Read: New Zealand World Cup Jersey : వరల్డ్ కప్ కు న్యూజిలాండ్ కొత్త జెర్సీ.. 29న హైదరాబాద్ లో కివీస్ మ్యాచ్

గతంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు బీసీసీఐ గోల్డెన్ అవార్డును అందజేసింది. గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కూడా గోల్డెన్ టికెట్‌తో సత్కరించారు. బీసీసీఐ ఈ ప్రత్యేక టిక్కెట్‌ను మరింత మంది ప్రముఖులకు బహుమతిగా ఇవ్వవచ్చు. ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న చెన్నైలో జరగనుంది.

మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీకి కూడా గోల్డెన్ టిక్కెట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీకి గోల్డెన్ టికెట్ ఇచ్చే విషయంలో ఎలాంటి అప్ డేట్ బీసీసీఐ నుంచి బయటకు రాలేదు.

సునీల్ గవాస్కర్ కూడా డిమాండ్

ఇటీవల సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ కు కూడా గోల్డెన్ టిక్కెట్ ఇవ్వాలన్నారు. ఇటీవల అతని నాయకత్వంలో భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర గౌరవనీయ వ్యక్తులు కాకుండా ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ కు కూడా గోల్డెన్ టికెట్ ఇవ్వాలి. ఈ జాబితాలో ఎంత మంది ఉన్నారో నాకు తెలియదని, అయితే ఇస్రో చీఫ్ ఎస్. సోమ్‌నాథ్‌కి కచ్చితంగా గోల్డెన్ టికెట్ ఇవ్వాలని గవాస్కర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.