Site icon HashtagU Telugu

Gambhir Mother: ఐసీయూలో గంభీర్ త‌ల్లి.. స్వ‌దేశానికి తిరిగివ‌చ్చిన టీమిండియా హెడ్ కోచ్‌!

Gambhir Mother

Gambhir Mother

Gambhir Mother: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనూహ్యంగా ఇంగ్లండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. గంభీర్ తల్లి సీమా గంభీర్‌ (Gambhir Mother) ఆరోగ్యం విషమించడంతో ఆమెను ఐసీయూలో చేర్చారు. ఈ కారణంగానే గంభీర్ భారత జట్టును విడిచి స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. నివేదికల ప్రకారం.. గంభీర్ వచ్చే వారం వరకు మళ్లీ ఇంగ్లాండ్ వెళ్లి జ‌ట్టును క‌ల‌వ‌నున్నారు. ఈసారి భారత జట్టు ఇంగ్లీష్ టూర్‌లో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత గిల్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది.

స్వదేశానికి గంభీర్ 

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. రెవ్ స్పోర్ట్స్ వార్తల ప్రకారం.. గంభీర్ తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను ఐసీయూలో చేర్చారు. తల్లి ఆరోగ్యం క్షీణించిన వార్త తెలియగానే గంభీర్ స్వదేశానికి బయలుదేరి, జూన్ 12 సాయంత్రం భారతదేశానికి చేరుకున్నారు. గంభీర్ వచ్చే వారం వరకు మళ్లీ జట్టుతో కలిసిపోతారని భావిస్తున్నారు. సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుండి లీడ్స్‌లో జ‌ర‌గ‌నుంది. ఈసారి ఇంగ్లండ్ టూర్ కోసం భారత జట్టు నాయకత్వం శుభ్‌మన్ గిల్ చేతుల్లో ఉంది. యువ కెప్టెన్‌ను దృష్టిలో ఉంచుకుంటే.. ఇంగ్లండ్ టూర్‌లో కోచ్‌గా గంభీర్ పాత్ర చాలా కీలకంగా భావిస్తున్నారు. గంభీర్ నాయకత్వంలో భారత జట్టు గతంలో ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందుకే ఈ సిరీస్ గంభీర్‌కు కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది.

Also Read: Army Helicopter : విమాన ప్రమాదం తర్వాత మరో కలకలం.. పఠాన్‌కోట్‌లో అపాచీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్

భారత్ vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్