Women IPL: 2023 నుంచే మహిళల ఐపీఎల్

మహిళా క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వుమెన్ ఐపీఎల్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 11:38 PM IST

మహిళా క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వుమెన్ ఐపీఎల్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచే ప్రారంభించనున్నట్టు చెప్పాడు. త్వరలోనే దీని గురించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని గంగూలీ తెలిపాడు.
ఇదిలా ఉంటే మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే క్రమంలో బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది అండర్‌15 కేటగిరీలో బాలికలకు వైట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించడానికి ప్లాన్‌ చేస్తోంది. ఈ సీజన్‌లో బాలికల అండర్ 15 టోర్నీ జరుగుతుందనీ దాదా వెల్లడించాడు. అంతర్జాతీయంగా మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోందని, మన టీమ్‌ కూడా బాగా రాణిస్తోందని గంగూలీ చెప్పుకొచ్చాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి వీలుగా బాలికలకు ఈ అండర్‌15 టోర్నీ ఉపయోగపడుతుందని దాదా చెప్పాడు.
మరోవైపుగత మూడు సీజన్లుగా పరిమిత వేదికల్లో జరుగుతున్న ఐపీఎల్ మళ్లీ పాత తరహాలోనే హోమ్‌, అవే పద్ధతిలోనే జరుగుతుందని గంగూలీ చెప్పాడు. దీనిపై రాష్ట్ర క్రికెట్ సంఘాలకు దాదా లేఖ రాశాడు. కొవిడ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఐపీఎల్‌ దేశంలోని చాలా మంది క్రికెట్‌ అభిమానులకు దూరమయిందన్న దాదాఇప్పుడు పరిస్థితులు మెరుగవడంతో వచ్చే ఏడాది నుంచి గతంలో నిర్వహించినట్లుగానే ఉండబోతోందనీ తెలిపాడు
2022 నుంచి ఐపీఎల్‌లో పది టీమ్స్‌ అయిన నేపథ్యంలో వచ్చే సీజన్‌ లో మ్యాచ్ ల సంఖ్య మరింత పెరగనుంది. దేశవాళీ క్రికెట్‌లో ప్రధాన టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కూడా ఎప్పటిలాగే హోమ్‌, అవే పద్ధతిలో జరుగుతుందని కూడా గంగూలీ తెలిపారు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ డిసెంబర్‌ 13 నుంచి ప్రారంభం కానుంది.