Site icon HashtagU Telugu

BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

Karun Nair

Karun Nair

BCCI: భార‌త క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుండి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. దుబాయ్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంచి ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడని వెల్లడించారు. “పడిక్కల్ ఇప్పటికే టెస్టు జట్టులో ఉన్నాడు. అతను ఆస్ట్రేలియా, ధర్మశాలలో ఆడాడు. అక్కడ ఒక అర్ధసెంచరీ సాధించాడు. ఇండియా-ఎ కోసం మంచి ఫామ్ చూపించాడు” అని అగార్కర్ అన్నారు.

“వెస్టిండీస్ సిరీస్‌కు రిషబ్ పంత్ ఫిట్‌గా లేడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టెస్టులకు అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం” అని అగార్కర్ తెలిపారు. ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్.. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా జట్టు నుండి తొలగించబడ్డాడు. ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఎప్పటిలాగే పక్కన పెట్టారు.

Also Read: Chhattisgarh High Court: 100 రూపాయ‌ల లంచం కేసు.. 39 సంవ‌త్స‌రాల త‌ర్వాత న్యాయం!

వెస్టిండీస్‌తో సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో ప్రారంభం కాగా, రెండో టెస్టు అక్టోబర్ 10 నుండి ఢిల్లీలో జరుగుతుంది. ఇంగ్లాండ్‌లో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో డ్రా చేసుకున్న తర్వాత భారత్‌కు ఇది మొదటి టెస్టు సిరీస్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) స్టాండింగ్స్‌లో భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, శ్రీలంక తర్వాత మూడో స్థానంలో ఉంది. స్వదేశంలో ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేస్తే WTCలో భారత్ స్థానం మెరుగుపడుతుంది.

వెస్టిండీస్ టెస్టులకు భారత జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, బి. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఎన్. జగదీసన్.

Exit mobile version