5th Test Squad: చివరి టెస్టులో బుమ్రా ఎంట్రీ, రాహుల్ ఔట్

చివరి టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. తాజాగా ఈ టెస్టు మ్యాచ్‌కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ధర్మశాల టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు

5th Test Squad : ధర్మశాలలో టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచ్ లు పూర్తి చేసుకున్న ఇరు జట్లు చివరిదైన ఐదో టెస్టులో నామామాత్రపు మ్యాచ్ ఆడనున్నారు. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించి హైదరాబాద్ వేదికగా భారత్ ను ఓడించింది. ఆ తర్వాత రోహిత్ సేన పుంజుకుంది. మిగతా రెండు, మూడు, నాలుగు మ్యాచుల్లో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు చివరిదైన నామమాత్రపు టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ చేసుకుని తమ దేశానికి తిరిగి వెళ్లనుంది.

చివరి టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. తాజాగా ఈ టెస్టు మ్యాచ్‌కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ధర్మశాల టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. గాయం కారణంగా ఐదో టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు.అదేవిధంగా రాంచీ టెస్టులో విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ధర్మశాల టెస్టుకి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ విడుదల చేసింది. సుందర్ తమిళనాడు జట్టులో చేరి ముంబైతో రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సెమీఫైనల్ మార్చి 2న ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ తర్వాతే అతను మళ్ళీ భారత జట్టులో చేరనున్నాడు. షమీ ఫిబ్రవరి 26 చీలమండ సమస్యకు విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం షమీ కోలుకుంటున్నాడు. త్వరలో NCAలో చేరుతాడని బీసీసీఐ తెలిపింది.

ధర్మశాలలో జరగనున్న చివరి టెస్టుకు ఎంపికైన వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా , యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కెఎల్ భరత్, దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఉన్నారు.

Also Read: Nara Lokesh : తెలుగు జన విజయ సభకు లోకేష్‌ ఎందుకు రాలేదు..?