Site icon HashtagU Telugu

IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో మరింత మజా

BCCI

BCCI

మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంటుంది… సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉన్నప్పుడో లేక వికెట్ల కోసం ప్రధాన బౌలర్లు శ్రమిస్తున్నప్పుడో అరెరె ఆ ప్లేయర్ ఉండుంటే భలేగా ఉండేది… ఖచ్చితంగా గెలిపించేవాడు..వికెట్లు తీసేవాడు.. ఇలా అనుకుంటూ ఉంటాం… ఇకపై ఇలా అనుకునే పరిస్థితి నిజం కాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఐపీఎల్ లో ఈ కొత్త రూల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లోపే దీనిని దేశవాళీ క్రికెట్ లో బీసీసీఐ ప్రయోగాత్మకంగా అమలు చేయబోతోంది. దీని పేరు ఇంపాక్ట్ ప్లేయర్..ఈ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ జరగుతుండగా 14 ఓవర్ల లోపు మరో ఆటగాడికి రిప్లేస్‌మెంట్‌గా ఆడించవచ్చు.

బౌలింగ్ సమయంలో కూడా కావాల్సిన బౌలర్‌ను తీసుకోవచ్చు. అయితే రిప్లేస్ మెంట్‌గా జట్టును వీడిన ఆటగాడు మాత్రం మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగే అవకాశం లేదు. కనీసం సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ చేసేందుకు కూడా కుదరదు. మ్యాచ్ జరుగుతుండగా.. ఫోర్త్ అంపైర్ లేదా.. ఫీల్డ్ అంపైర్‌కు సమాచారమిచ్చి ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపాలి. ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేస్తున్నారు. ఈ కొత్త రూల్ కారణంగా మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండనుంది. ముఖ్యంగా ఏ ఆటగాడైన తీవ్రంగా గాయపడి ఆడే లేని పరిస్థితులో ఉన్నప్పుడు ఆ జట్టుకు బాగా ఉపయోగపడనుంది.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడంతో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. అక్టోబర్ 11 నుంచి జరగనున్న దేశవాళీ టీ ట్వంటీ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్‌ను ప్రయోగించాలని బీసీసీఐ భావిస్తోంది. అక్కడ విజయవంతమైతే ఐపీఎల్‌లో కూడా అమలు చేయనున్నారు. అటు బిగ్ బాష్ లీగ్ , లెజెండ్స్ క్రికెట్ లీగ్ లలో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను అమలు చేస్తున్నారు.

Exit mobile version