Independence Day 2023: బీసీసీఐ కి షాకిచ్చిన మోడీ

దేశమంతా ఈ రోజు 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశప్రజలంతా తమ సోషల్ మీడియా డిస ప్లే ఫోటోకి మువ్వెన్నల జెండాను పెట్టుకోని దేశభక్తి చాటుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Independence Day 2023: దేశమంతా ఈ రోజు 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశప్రజలంతా తమ సోషల్ మీడియా డిస ప్లే ఫోటోకి మువ్వెన్నల జెండాను పెట్టుకోని దేశభక్తి చాటుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.మోడీ చెప్పినట్టే బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతా డిస్ ప్లే పిక్ లో త్రివర్ణ పతాకం ఫోటోని పెట్టింది. దాంతో ఎలాన్ మస్క్ రంగంలోకి దిగాడు. క్షణాల్లో బీసీసీఐ ట్విట్టర్ ఖాతకున్న బ్లు టిక్ ని తీసేశాడు. బ్లూటిక్ లేని బీసీసీఐ ట్విట్టర్ ఖాతాను చూసి నెటిజ‌న్లు విస్తుపోయారు. ఏమైందోనని టెన్షన్ పడ్డారు. ఇది ఒరిజిన అకౌంట్ హా ఫెక్ అకౌంట్ అని సందేహపడ్డారు. . ఇంతకీ మస్క్ మామాకి బీసీసీఐ మీద కోపం ఎందుకొచ్చిందంటే.. ట్విట్టర్లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు ఎలాన్ మస్క్. ఏదైనా ఖాతా ప్రొఫైల్ డీపీ మారిన వెంట‌నే ఆ ఖాతా బ్లూటిక్ ఎగిరిపోతుంది. ఆ త‌ర్వాత ఆ ఖాతాను ఎక్స్ మేనేజ్‌మెంట్ రివ్యూ చేస్తుంది. ఒకవేళ సదరు ట్విట్టర్ ఖాతాదారులు రూల్స్ పాటిస్తే అప్పుడు బ్లూ టిక్‌ను పున‌రుద్ధ‌రిస్తుంది. లేదంటే అంతే సంగ‌తులు. ట్విట్టర్ రివ్యూ చేరిన తరువాత బీసీసీఐ ట్విట్టర్ అకౌంట్ కు బ్లు టిక్ వచ్చే అవకాశమున్నా అదికూడా కొన్ని క్షణాలు మాత్రమే. మళ్ళీ మస్క్ మామ బీసీసీఐ షాకిచ్చి ఆ వెంటనే బ్లు టిక్ రీమూవ్ చేసేస్తాడు, ఎందుకంటే ఆగష్టు 15 తరువాత బీసీసీఐ మళ్ళీ తన డిస్ ప్లే పిక్ మార్చేసి బీసీసీఐ లోగోని అప్లోడ్ చేస్తుంది. డిస్ ప్లే పిక్ మార్చినందుకు గానూ మళ్ళీ బీసీసీఐ బ్లు టిక్ కోల్పోతుంది. ఆపై రివ్యూ అయ్యాక బ్లు టిక్ వస్తుంది. విశేషమేంటంటే ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ డిపి మార్చినప్పటికీ మోడీ ట్విట్టర్ ని మస్క్ టచ్ చేయలేకపోయాడు. మోడీ కెపాసిటీ తెలిసి తెలిసి మస్క్ రిస్క్ తీసుకోలేడు కదా.

Also Read: Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన