BCCI Central Contracts: ఇషాన్‌, శ్రేయాస్‌లను తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది: గంగూలీ

ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేయడం ద్వారా బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరిద్దరినీ మినహాయించారు.

BCCI Central Contracts: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేయడం ద్వారా బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరిద్దరినీ మినహాయించారు. ఈ కీలక నిర్ణయంతో బీసీసీఐ ఇద్దరు ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. కాగా గత ఏడాది ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఇద్దరు ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 2023లో భారత్ తరఫున ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అయ్యర్‌ పాల్గొన్నాడు. అయ్యర్ గ్రేడ్ బి కాంట్రాక్ట్‌లో భాగంగా ఉండగా, కిషన్ గత సీజన్‌లో గ్రేడ్ సి జాబితాలో ఉన్నాడు.

సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. కిషన్ మరియు అయ్యర్‌లపై బీసీసీఐ నిర్ణయం సరైనదేనని అన్నాడు. శ్రేయాస్‌, ఇషాన్‌లు మేజర్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ ఆడకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆటగాళ్లు తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలి.ముఖ్యంగా ఇషాన్ కిషన్ లాంటి ప్రతిభ ఉన్నప్పుడే ఆడాలని గంగూలీ అన్నాడు.

సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితాలో చటేశ్వర పుజారా, అజంక్య రహానేలకు కూడా చోటు దక్కలేదు. పుజారా రంజీల్లో పరుగుల వరద పారిస్తున్నా బీసీసీఐ పట్టించుకోలేదు. గ్రేడ్ ఏ ప్లస్‌లో నలుగురు ఆటగాళ్ళకు మాత్రమే చోటు దక్కింది. రోహిత్‌శర్మ, కోహ్లీ, బూమ్రా, జడేజా గ్రేడ్ ఏ ప్లస్‌లో ఉన్నారు. గ్రేడ్ ఏలో అశ్విన్, షమీ, సిరాజ్, రాహుల్, గిల్, పాండ్యా ఉన్నారు. గ్రేడ్ బీలో సూర్యకుమార్ యాదవ్, పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జైశ్వాల్ చోటు దక్కించుకున్నారు. గ్రేడ్ సి లో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్ లు చోటు దక్కించుకున్నారు.

ఈసారి కొత్తగా 10 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కింది. తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, ముకేశ్ కుమార్, రజత్ పాటిదార్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో అవకాశం కల్పించింది. మరోవైపు గతేడాది కాంట్రాక్టు జాబితాలో ఉన్నఏడుగురు ఆటగాళ్లు ఈ సారి స్థానం కోల్పోయారు. పుజారా, శ్రేయస్ అయ్యర్, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్‌ తాజాగా బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టు జాబితాలో అవకాశం కోల్పోయారు.

Also Read: Indraganti Mohanakrishna Priyadarshi : అభిరుచిగల దర్శకుడు.. ప్రతిభగల హీరో.. కాంబో సెట్ అయ్యింది..!