Site icon HashtagU Telugu

BCCI: బీసీసీఐ గుడ్ న్యూస్, టీమిండియా ఆటగాళ్లకు మూడు రోజులు రెస్ట్

india team

india team

BCCI: వరుస సీరిస్ లు, టెస్టులు, ఆ తర్వాత ప్రపంచ కప్ పోటీలతో టీమిండియా ఆటగాళ్లకు ఏమాత్రం విశ్రాంతి దొరకని పరిస్థితి. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ప్లేయర్లకు కాస్త బ్రేక్‌ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ధర్మశాల వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ఉంటుంది.

ఇక ఆ తర్వాత మ్యాచ్‌ ఇంగ్లండ్‌తో అక్టోబర్ 29న ఉంటుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య వారం రోజుల గ్యాప్‌ ఉంటుంది. దాంతో.. ఓ మూడ్రోజుల పాటు టీమిండియా ఆటగాళ్లకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ అనుమతిచ్చినట్లు సమాచారం అందుతోంది.

అయితే.. ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. సుదీర్ఘమైన ప్రపంచ షెడ్యూల్ కారణంగా టీమిండియా ప్లేయర్లకు విరామం దొరకడం లేదు. అదీకాక అంతకుముందు కూడా వరుసగా టోర్నీలు ఆడివచ్చారని చెప్పారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌ల మధ్య వారం రోజుల గ్యాప్‌ ఉండటంతో బ్రేక్‌ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సదురు అధికారి వెల్లడించారు. వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లే స్ లో ఉంది.

Exit mobile version