భారతదేశానికి ఆడే టీంఇండియా ప్లేయర్స్ మన IPL లో తప్ప వేరే దేశాల్లోని లీగ్స్ లో ఆడకూడదని గతంలోనే BCCI చెప్పింది. తాజాగా దీనిపై మరోసారి కీలక ప్రకటన చేసింది. ఇటీవల దుబాయ్ లో కూడా IPL లాంటి భారీ లీగ్ ని నిర్వహించాలని సౌదీ అరేబియా క్రికెట్ ఇండియన్ ఫ్రాంచైజీలకి ఆఫర్ ఇచ్చింది. దుబాయ్ లో అత్యంత ధనిక లీగ్ ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు ఇండియన్ క్రికెటర్స్ కూడా ఆ లీగ్స్ లో ఆడాలనుకుంటున్నారు.
దీనిపై తాజాగా BCCI అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఏ క్రికెటర్ కూడా విదేశీ లీగ్స్ లో ఆడేందుకు అనుమతించం. IPL ఫ్రాంచైజీలు మాత్రం అక్కడ కూడా టీమ్స్ కొనుక్కోవచ్చు, అది బిజినెస్, వాళ్ళ ఇష్టం. ఇప్పటికే కొన్ని ఇండియన్ IPL ఫ్రాంచైజీలకు దక్షిణాఫ్రికా, అమెరికా, కరేబియన్ లీగ్స్ లో జట్టులు ఉన్నాయి. అధికారికంగా ఇండియన్ టీంకు ఆడే ఏ క్రికెటర్ కూడా వేరే దేశంలోని లీగ్స్ కు మాత్రం ఆడరు అని తెలిపారు.
ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్, పాక్ లీగ్, దక్షిణాఫ్రికా, కరేబియన్, అమెరికా లీగ్స్ లో అనేక మంది విదేశీ క్రికెటర్స్ ఆడుతున్నారు, మన ఇండియన్స్ తప్ప. ఇప్పుడు దుబాయ్ భారీగా లీగ్ ప్లాన్ చేయాలనుకుంటుంది. కానీ ఇండియన్ క్రికెటర్స్ ఆడితేనే ఆ లీగ్ కి ఎక్కువ పేరు వస్తుందని భావించి ఇండియన్ క్రికెటర్స్ కోసం ట్రై చేస్తున్నా BCCI ఇలా సమాధానం ఇచ్చింది. మరి దుబాయ్ లో సరికొత్త క్రికెట్ లీగ్ స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి.