BCCI Central Contracts : రవీంద్ర జడేజాకు శుభవార్త చెప్పిన బీసీసీఐ, కేఎల్ రాహుల్ కు డిమోషన్.!

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 08:53 AM IST

క్రికెటర్లకు నాలుగు విభాగాల్లో వార్షిక కాంట్రాక్టులను (BCCI Central Contracts) ప్రకటిస్తుంది బీసీసీఐ. ఇందులో ఎ ప్లస్, ఎ, బీ సీ గ్రేడ్ లు ఉంటాయి. అందులో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా BCCI యొక్క వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లో A+ గ్రేడ్‌కి పదోన్నతి పొందాడు. జడేజాతో పాటు, ఇతర ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వరుసగా B, C నుండి గ్రేడ్ Aకి ప్రమోట్ చేయగా, వరస వైఫల్యాలతో సతమతమవుతున్న KL రాహుల్ కు మాత్రం బీసీసీఐ షాకిచ్చింది. గ్రేడ్ Aనుంచి Bకి పడిపోయాడు. బౌలింగ్ విభాగంలో రాణిస్తున్న అక్షర్ పటేల్ కు ఏ గ్రేడ్ లోకి ప్రమోషన్ లభించింది. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ టెస్టుల్లో అరంగ్రేటం చేసిన ఈ ఆంధ్ర క్రికెటర్ భరత్ కు బోర్డులో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. అతను సి గ్రేడ్ కొనసాగుతున్నారు. మరోవైపు, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌లు సి నుండి గ్రేడ్ బికి మారారని బిసిసిఐ తెలిపింది.

పేసర్ శార్దూల్ ఠాకూర్ గ్రేడ్ బి నుండి సికి పడిపోయాడు, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్ అందరూ గ్రేడ్ సిలో చోటు దక్కింది. ఇంతకుముందు గ్రేడ్ బిలో ఉన్న అనుభవజ్ఞులైన అజింక్యా రహానే, ఇషాంత్ శర్మలకు కాంట్రాక్టులు ఇవ్వకపోగా, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహర్‌లు ఈ జాబితా నుంచి తప్పించారు.

బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో నాలుగు గ్రూపులు ఉన్నాయి, ఇందులో ‘ఎ+’ ఆటగాళ్లు రూ. 7 కోట్లు, ‘ఎ’ ఆటగాళ్లు రూ. 5 కోట్లు, ‘బి’ ఆటగాళ్లు రూ. 3 కోట్లు, ‘సి’ ఆటగాళ్లు రూ. కోటి వేతనం చెల్లిస్తుంది.

పురుషుల కోసం BCCI కాంట్రాక్ట్‌ల జాబితా:

గ్రేడ్ A ప్లస్ కేటగిరీ: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ A వర్గం: హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్

గ్రేడ్ బి కేటగిరీ: ఛెతేశ్వర్ పుజారా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్

గ్రేడ్ సి కేటగిరీ: ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్.