WTC Final: టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన నేతృత్వంలో టీమిండియా రెండు ప్రపంచ కప్ లు గెలుచుకుంది. ఇక ధోని కెప్టెన్సీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మైదానంలో కూల్ గా ఉంటూనే సడెన్ నిర్ణయాలు తీసుకుంటూ జట్టుని విజయపథంలోకి తీసుకెళతాడు. తాజాగా ధోనీని బీసీసీఐ సంప్రదించిందట.
జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 2021 తర్వాత అజింక్య రహానే తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఒక నివేదిక ప్రకారం అజింక్యా రహానె జట్టులో రావడానికి ధోని కారణం అంటున్నారు. దాని వెనుక బీసీసీఐ ధోనితో సంప్రదింపులు జరిపినట్టు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ధోని సలహా మేరకు రహానేను జట్టులోకి తీసుకున్నారట.
రహానే చివరిసారిగా 2021లో దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తరుపున ఆడాడు. ఫామ్ కోల్పోయిన రహానెను బీసీసీఐ దూరం పెట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే 136 పరుగులు మాత్రమే చేయగలిగాడు.2021లో భారత్ ఇంగ్లండ్ పర్యటనలో రహానే ఫామ్‌లో లేడు. నాలుగు టెస్టుల్లో 15.57 సగటుతో 109 పరుగులు చేశాడు. తన చివరి 15 టెస్టుల్లో, అజింక్య రహానే 23.7 సగటుతో 547 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుతం అజింక్యా రహానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16వ సీజన్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్ 5 మ్యాచ్‌లలో 199 స్ట్రైక్ రేట్‌తో 209 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ (MI) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లపై అర్ధ సెంచరీలు సాధించాడు.
Read More: Jagan : అవినాష్ రెడ్డికి చెక్, తెరపైకి జగన్ మరో బ్రదర్