BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ లో వారికి ప్రమోషన్ ఖాయమే

టీ ట్వంటీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్ ప్రమోషన్ అందుకానున్నారు.

  • Written By:
  • Publish Date - January 30, 2023 / 12:19 PM IST

బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ జాబితాను వచ్చే నెలలో ప్రకటించనుంది. బోర్డు వార్షిక ఎన్నికలు, సెలక్షన్ కమిటీ నియామకం కారణంగా లిస్ట్ ఎంపిక ఆలస్యమైంది. ఇప్పుడు జాబితా రెడీ అయింది.అయితే జాబితాలో పలు మార్పులు జరగనున్నాయి. కొంతమంది ఆటగాళ్లు ప్రమోషన్‌ పొందనున్నారు. టీ ట్వంటీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్ ప్రమోషన్ అందుకానున్నారు. వీరిద్దరూ ఏ గ్రేడ్ కు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. సూర్య ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్, అలాగే వన్డేల్లో కూడా దూసుకెళ్తున్నాడు. వీరితో పాటు శుభ్‌మన్ గిల్ కు కూడా ప్రమోషన్ దక్కనుంది. గిల్ కూడా అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా అయ్యాడు. ఈ ముగ్గురికి గ్రేడ్‌-ఏ జాబితాలో చోటు ఖాయమైందని సమాచారం. వీరితో పాటు ఇషాన్‌ కిషన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు కొత్తగా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరికి గ్రేడ్‌-సి జాబితాలో చోటు దక్కడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.

గ్రేడ్‌-ఏ+ జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవని.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా ఈ జాబితాలో అలాగే కొనసాగుతారని తెలుస్తోంది. ఇక, సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ కోల్పోయే ఆటగాళ్ళ జాబితాలో శిఖర్‌ ధవన్‌, అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మ, వృద్దిమాన్‌ సాహా, మయాంక్‌ అగర్వాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురు వచ్చే సెంటల్ర్‌ కాంట్రాక్ట్స్‌లో చోటు కోల్పోవడం దాదాపుగా ఖరారైంది. ఇదిలా ఉంటే
ఆటగాళ్ల వేతన సవరణ అంశంపై కూడా చర్చ జరిగినట్లు బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఏ+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లుకు 7 నుంచి 10 కోట్లు, ఏ కేటగిరీలో ఉన్నవారికి 5 నుంచి 7, బి కేటగిరీలో ఉన్న ప్లేయర్స్‌కు 3 నుంచి 5, సి కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు కోటి నుంచి 3 కోట్లకు వార్షిక వేతనం పెరుగనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.