Site icon HashtagU Telugu

Women’s Indian Premier League: మహిళల ఐపీఎల్ కు ఆమోదం తెలిపిన బీసీసీఐ..!

Womens T20 Challenge 2022 Controversy Will Last For 4 Days

Womens T20 Challenge 2022 Controversy Will Last For 4 Days

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం ముంబైలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించాలని ప్రతిపాదించింది. “ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని నిర్వహించడానికి జనరల్ బాడీ ఆమోదించింది” అని జే షా AGMలో తీసుకున్న కీలక నిర్ణయాలను వివరిస్తూ BCCI విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

మొత్తం 22 మ్యాచ్‌లు ఆడనున్న ఈ టోర్నీలో ఐదు జట్లు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో స్క్వాడ్‌లో 18 మంది ఆటగాళ్లు ఉంటారు. వీరితో పాటు విదేశాల నుంచి గరిష్టంగా ఆరుగురు ఉంటారు. ప్లేయింగ్ ఎలెవన్ లో గరిష్టంగా ఐదుగురు విదేశీ ఆటగాళ్ళు ఉండనున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన ఇతర వివరాలు పూర్తిగా తెలియరాలేదు.

2023లో మహిళల ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. వీటితో పాటు 2025 వరకు టీమిండియా పురుషులు, మహిళల జట్ల పర్యటనలను కూడా ఖరారు చేశారు. ముంబైలో మంగళవారం జరిగిన 91వ వార్షిక సమావేశంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే మార్చిలో ప్రారంభంకానున్న మహిళల ఐపీఎల్ లో ఈసారి 5 జట్లు ఆడనున్నాయి. మరోవైపు టీమిండియా మెన్స్ టీమ్ వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనట్లేదని చెప్పింది.