Site icon HashtagU Telugu

BCCI Election: అక్టోబరు 18న బీసీసీఐ ఎన్నికలు… నోటిఫికేషన్ విడుదల

BCCI

BCCI

బీసీసీఐ కార్యవర్గం వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఇటీవల సుప్రీంకోర్టు ఓకే చెప్పడం తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ ఎన్నికలకు గంట మోగింది.

నేడు నోటిఫికేషన్ విడుదలైంది. బీసీసీఐ ఆఫీసు బేరర్ల పదవుల కోసం అక్టోబరు 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 18న ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు కూడా అదే రోజున వెల్లడిస్తారు. ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా వ్యవహరిస్తున్నారు. అయితే, గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశం ఉందని, జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా పీఠం ఎక్కుతారని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Exit mobile version