Site icon HashtagU Telugu

BCCI: అండర్-19 మహిళ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా

BCCI

BCCI

BCCI: మలేషియాలో జరిగిన అండర్-19 మహిళల టి-20 ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొట్టింది. తమ అసాధారణ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను చిత్తూ చేసింది. టీమిండియా ఛాంపియ‌న్ గా నిల‌వ‌డంలో తెలుగ‌మ్మాయి గొంగ‌డి త్రిష కీల‌క పాత్ర పోషించింది.ఓ వైపు బ్యాట్, మరోవైపు బంతితో అద్భుతంగా రాణించింది. ఈ టోర్నీలో 7 మ్యాచ్ ల‌ను ఆడిన త్రిష 309 ప‌రుగులు చేయడంతో పాటు, 7 వికెట్లు తీసుకుని ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును గెలుచుకుంది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో భారత మహిళల జట్టు రెండోసారి అండర్ 19 టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచింది. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్న భారత జట్టు, రెండేళ్ల తర్వాత రెండో టైటిల్‌ను నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. 83 పరుగుల సులభమైన లక్ష్యాన్ని భారత్ 11.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

Also Read: Bhumana Karunakar : నలుగురు కార్పోరేటర్ల ఎక్కడ ఉన్నారో.. ఏమయ్యారో తెలియదు

అండర్-19 మహిళల టి-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు బీసీసీఐ (BCCI) రివార్డు కిందా భారీ మొత్తంలో అవ్వనుంది. ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా మహిళ జట్టుకు రూ.5 కోట్ల నగదు బహుమతిగా ఇస్తామని బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ సాధించినందుకు అభినందనలు తెలిపింది. కాగా బీసీసీఐ ప్రకటించిన 5 కోట్లు జట్టులోని 15 మంది ఆటగాళ్లు, ప్రధాన కోచ్ నుషీన్ అల్ ఖదీర్ మరియు మిగిలిన సహాయక సిబ్బందికి పంపిణీ చేస్తారు.