Site icon HashtagU Telugu

IND vs SA: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌.. వేదిక‌లు ఖరారు..!!

Team India

Team India

IPL-2022 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశాన సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20సిరీస్ లు ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 9న ప్రారంభమై..జూన్ 19న ముగుస్తుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ వేదికలను శనివారం బీసీసీఐ ఖరారు చేసింది. తొలి రెండు టీ 20లు ఢిల్లీ, కటక్ వేదికగా జరగున్నాయి. ఇక మూడో టీ20 విశాఖలో జరగనుంది.

ఆఖరి రెండు టీ 20లు రాజ్ కోట్, బెంగళూరు వేదికగా జరుగుతాయి. ఇక సిరీస్ అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. గతేడాది ఐదు టెస్టుల సిరీస్ లోవాయిదా పడిన టెస్టును భారత్ ఇప్పుడు మళ్లీ ఆడనుంది.