Site icon HashtagU Telugu

India Jersey Logo: ఇండియా జెర్సీపై లోగో మార్పు.. ఇకపై డ్రీమ్ 11 లోగో

India Jersey Logo

New Web Story Copy 2023 07 01t115227.255

India Jersey Logo: కొన్నేళ్లుగా ఇండియా జెర్సీపై బైజూస్ లోగో చూస్తున్నాం. అయితే ఇకపై బైజూస్ లోగో కనిపించదు. ఇకనుంచి డ్రీమ్ 11 లోగో ఇండియా జెర్సీపై చూడబోతున్నాం. తాజాగా బీసీసీఐ ఈ విషయాన్ని ప్రకటించింది. బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో భారత జట్టుకు కొత్త లీడ్ స్పాన్సర్‌ను ప్రకటించింది. బీసీసీఐ బోర్డు మరియు డ్రీమ్ 11 మధ్య మూడేళ్ల ఒప్పందం కుదిరింది.

వెస్టిండీస్ పర్యటన నుంచే భారత జట్టు కొత్త అవతారంలో కనిపించనుంది. కరీబియన్ జట్టుతో టెస్టు సిరీస్ ప్రారంభం నుంచి టీమ్ ఇండియా జెర్సీపై డ్రీమ్ 11 లోగో కనిపించనుంది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. డ్రీమ్ 11ని భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా చేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సంతోషం వ్యక్తం చేశారు.

డ్రీమ్ 11 2019 నుండి మార్చి 2023 వరకు భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా ఉంది. అయితే, ఇప్పుడు బోర్డు డ్రీమ్ 11తో చేతులు కలిపింది. డ్రీమ్ 11 మరియు BCCI మధ్య ఎప్పటినుంచో సంబంధం కొనసాగుతుంది. డ్రీమ్ 11 కంపెనీ 2020 సంవత్సరంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది.

వెస్టిండీస్‌ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. టీమ్ ఇండియా టూర్‌ను టెస్ట్ మ్యాచ్‌లతో ప్రారంభించనుంది, ఇందులో మొదటి మ్యాచ్ జూలై 12 నుండి జరగనుంది. దీని తర్వాత, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కరీబియన్ జట్టుతో రోహిత్ సేన తలపడుతుంది. చివరగా T20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటిలో అమెరికా రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

Read More: Minister KTR Serious : సొంత పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన మంత్రి కేటీఆర్‌.. ఈసారి అత‌న్ని ప‌క్క‌న పెట్టిన‌ట్లేనా?