Virat Kohli: పరిస్థితులకు తగ్గట్టు కోహ్లీ ఆడతాడు: బ్యాటింగ్ కోచ్

టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఆడే విధానం చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఓటమి తధ్యం అనుకున్న సమయంలోనూ మ్యాచ్ ను గెలిపించే సత్తా కోహ్లీలో ఉంది.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli

New Web Story Copy 2023 07 17t105731.136

Virat Kohli: టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఆడే విధానం చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఓటమి తధ్యం అనుకున్న సమయంలోనూ మ్యాచ్ ను గెలిపించే సత్తా కోహ్లీలో ఉంది. ఫార్మేట్ ఏదైనా కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్ తో రికార్డులు సృష్టించగలడు. అవసరమైనప్పుడు దూకుడుగా ఆడటమే కాదు, జిడ్డుగా ఎలా ఆడొచ్చో కూడా కోహ్లీని చూసి నేర్చుకోవచ్చు. తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ కోహ్లీ ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. తాజాగా బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో కోచ్ కోచ్ గురించి గొప్పగా వర్ణించాడు.

మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా కోహ్లీ తనను తాను మార్చుకోగలడు.బ్యాటింగ్ తాను ప్రదర్శించే వేరియేషన్స్ మరే ఆటగాడిలోనూ చూడలేదని చెప్పారు కోచ్. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో విరాట్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆధిపత్యం చెలాయించేందుకు విరాట్ కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడని చెప్పారు. ఫార్మేట్ ఏదైనా విభిన్నంగా ఆడే లక్షణం కోహ్లీలో కనిపిస్తుందని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

Read More: Sharad Pawar Skip : తొలిరోజు విపక్షాల మీటింగ్ కు శరద్ పవార్ దూరం

  Last Updated: 17 Jul 2023, 12:43 PM IST