Site icon HashtagU Telugu

Highest Ever T20 Total: టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు.. సిక్కింపై బరోడా 349 పరుగులు నమోదు

Highest Ever T20 Total

Highest Ever T20 Total

Highest Ever T20 Total: ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీ20 (Highest Ever T20 Total) ప్రపంచ రికార్డ్ నమోదైంది. సిక్కింతో జరిగిన మ్యాచ్ లో వడోదర 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీ-20 స్కోర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ మ్యాచ్ లో బరోడా 37 సిక్సర్లు నమోదు చేసింది. ఇందులో బరోడా స్టార్ బ్యాటర్ భాను పానియా ఒక్కడే 15 సిక్సర్లు కొట్టాడు. ఒక టి20లో 37 సిక్సర్లు నమోదయ్యాయి అంటే బౌలర్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అటు బ్యాటర్ల విధ్వంసాన్ని కూడా అంచనా వేయవచ్చు.

బరోడా ధాటికి గత టి20 రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ మ్యాచ్‌లో బరోడా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ లో భాను పునియా విధ్వంసకర ఇన్నింగ్స్ కు తెరలేపాడు. 51 బంతుల్లో 15 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 134 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భానుతో పాటు అభిమన్యు సింగ్, శివాలిక్ శర్మ, సోలంకి అర్ధ సెంచరీలు చేశారు. అభిమన్యు సింగ్ రాజ్‌పుత్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53, శివాలిక్ శర్మ 17 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 55, విష్ణు సోలంకి 16 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 50 పరుగులతో అందరూ హాఫ్ సెంచరీలు బాదారు. దీంతో వడోదర 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. అయితే అత్యధిక స్కోరు సాధించిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా జట్టులో చోటు దక్కించుకోలేదు. కాగా వడోదర జట్టుకు కృనాల్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు.

Also Read: Transport Department: ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు.. రవాణా శాఖ సాధించిన విజయాలు!

ఈ ఏడాది ప్రారంభంలో గాంబియాపై జింబాబ్వే 344/4 స్కోరు చేసింది. ఆ మ్యాచ్ లో జింబాబ్వే 27 సిక్స్ లు బాదింది. 2023లో నేపాల్ మంగోలియాను ఓడించి 20 ఓవర్లలో 314/3 పరుగులు చేసింది. అక్టోబర్ 2024లో బంగ్లాదేశ్‌పై భారత క్రికెట్ జట్టు 297/6 పరుగులు చేసింది. ఇలా టి20 ఫార్మెట్లో 250 స్కోరును అందుకోవడం సాధారణం అయిపోయింది.