WPL 2023: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ విజయవంతం అవుతుందా?

బీసీసీఐ మొదటిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 చివరి అంకానికి చేరుకుంది. నేటితో ఈ లీగ్ దశ

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 05:40 PM IST

బీసీసీఐ మొదటిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 చివరి అంకానికి చేరుకుంది. నేటితో ఈ లీగ్ దశ మ్యాచులు ముగియనున్నాయి. ఇందులో ఆర్‌సీబీ, ముంబైలు తలపడనున్నాయి. అలాగే మరొక మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ ఆఖరి మ్యాచ్‌ జరిగనుంది. అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్జ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీ వుమెన్‌, గుజరాత్‌ జెయింట్స్‌ లీగ్‌ దశలోనే నిష్క్రమించాయి. మరి మెన్స్‌ ఐపీఎల్‌ మాదిరిగానే వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ విజయవంతమైందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే పురుషుల ఐపీఎల్‌ తో పోలిస్తే డబ్ల్యూపీఎల్‌కు అంతగా ఆదరణ లేదు. అయినప్పటికీ తొలివారం ముగిసేసరికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. అలా మొత్తం అన్ని వర్గాలు కలిపి 50.78 మిలియన్‌ మంది వీక్షించినట్లు బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్జీ కౌన్సిల్‌ వెల్లడించింది. ఇక అందులో 15+ ఏజ్‌ గ్రూప్‌లో 40.35 మిలియన్‌ మంది ఉన్నట్లుగా తెలిపింది. అయితే అన్నిటికంటే ఎక్కువగా వీక్షించిన మ్యాచ్ ఆర్‌సీబీ వుమెన్‌, ముంబై ఇండియన్స్‌. ఈ మ్యాచ్‌కు 0.41 రేటింగ్‌ నమోదైనట్లు తెలిపింది. ఇక గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ ఆర్‌సీబీ మ్యాచ్‌ 0.40 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది.

ఆ తర్వాత అత్యధికంగా వీక్షించిన వాటిలో వరుసగా ముంబై ఇండియన్స్‌ వుమెన్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ 0.26 రేటింగ్ కాగా,ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ ఆర్‌సీబీ వుమెన్‌ 0.24 రేటింగ్, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ 0.34 రేటింగ్ ఆర్‌సీబీ వర్సెస్‌ యూపీ వారియర్జ్‌ 0.33 టీఆర్పీ రేటింగ్స్‌ ను సాధించాయి. అయితే ఈ వారం లో ముగియనున్న డబ్ల్యూపీఎల్‌ వంద మిలియన్‌ వ్యూస్‌ సాధించడం కష్టమే అనిపీస్తోంది. ఓవరాల్‌గా 70 నుంచి 80 మిలియన్ల వ్యూస్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు బార్క్‌ తెలిపింది. ఈ లెక్కన తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ విజయవంతమైనట్లే అని చెప్పవచ్చు.