Bangladesh Face Punishment: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు భారత్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలు వెంట వెంటనే బంగ్లా బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు ముందుగా అద్భుత బౌలింగ్‌ను ప్రదర్శించారు. అయితే బంగ్లాదేశ్‌పై ఐసీసీ చర్యలు (Bangladesh Face Punishment) తీసుకోవచ్చు. దీనికి పెద్ద కారణం కూడా వెలుగులోకి వచ్చింది.
బంగ్లాదేశ్‌కు ఎందుకు జరిమానా విధించవచ్చు?
తొలిరోజు ఆట ముగిసే సమయానికి విజిటింగ్ జట్టు ప్రమాదంలో పడింది. మొదటి రోజు బంగ్లాదేశ్ జట్టు 80 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగింది. బంగ్లాకు 30 నిమిషాలు అదనంగా ఇవ్వబడింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ 10 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. ICC నిబంధనల ప్రకారం.. ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక రోజులో ఒక జట్టు 90 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అయితే మొదటి రోజు అదనపు సమయం లభించినా.. బంగ్లాదేశ్ 90 ఓవర్లు వేయలేకపోయింది. ఇప్పుడు ICC బంగ్లాదేశ్‌కు జరిమానా విధంచవచ్చని తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌కు ఎలాంటి శిక్ష పడుతుంది?
తొలిరోజు 10 ఓవర్ల కంటే తక్కువ బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టుపై ఐసీసీ జరిమానా విధించవచ్చు. దీని కారణంగా బంగ్లాదేశ్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల తగ్గింపుతో పాటు మ్యాచ్ ఫీజు కూడా తగ్గిస్తారు. ఇంతకు ముందు కూడా పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బంగ్లాదేశ్‌కు జరిమానా విధించారు. ఆ సమయంలో ICC బంగ్లాదేశ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుండి 3 పాయింట్లను తగ్గించింది.
తొలిరోజు టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అశ్విన్ అద్భుత సెంచరీ సాధించగా, జడేజా కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. అశ్విన్ 102, జడేజా 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.