Site icon HashtagU Telugu

Shakib Al Hasan: అభిమాని చెంప చెల్లుమనిపించిన షకిబ్

Shakib Al Hasan

Shakib Al Hasan

Shakib Al Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటాడు. ఆటలో అతను నిస్సందేహంగా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఉంటున్నప్పటికీ నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అతను ఆట పరంగా క్రికెట్ వరల్డ్‌లో ఎంత ఫేమసో… వివాదాల్లో నిత్యం వార్తల్లో నిలవడంలో కూడా అంతే ఫేమస్‌.

గత ప్రపంచకప్ లో బాంగ్లాదేశ్ శ్రీలంక మ్యాచ్ లో షకిబ్ అల్ హసన్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది.మాథ్యూస్ టైం అవుట్ విషయంలో షకీబ్ అపీల్ చేయడంతో అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. మాథ్యూస్ అభ్యర్థించినా.. ఔట్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో వివాదాస్పదంగా మారింది. ఆ ఘటనతో షకీబ్ ను సెల్ఫీస్ క్రికెటర్ గా అభిమానులు ట్రోల్స్ చేశారు. కనీసం క్రీడాస్ఫూర్తి లేకుండా షకీబ్ ప్రవర్తినించిన తీరుపై క్రికెట్ మాజీలు సైతం విమర్శించారు. ఆ తర్వాత అతనిని ఓ ఈవెంట్ లో కొందరు కొట్టినట్లు వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఇలా షకీబ్ నిత్యం ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా షకిబ్ అల్ హసన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. సెల్ఫీ కోసం వెనుక నుంచి ఇబ్బందికి గురిచేసిన ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షకీబ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన షకిబ్‌ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. అవామీ లీగ్ పార్టీ తరపున మగురా-1 స్థానం నుంచి పోటీ చేసి గెలిచాడు. అంతేకాదు షకిబ్ పోటీచేసిన పార్టీ అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 300 సీట్లకుగానూ 299 స్థానాలకు ఎన్నికలు జరగగా అవామీ లీగ్‌ 200 స్థానాలు గెలిచి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనా వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టారు. అయితే ఓటింగ్‌ నాడు పోలింగ్ బూత్‌కు వెళ్లిన బాంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్‌ కోసం అభిమానులు పోటెత్తారు. అతనిని ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అతనితో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో షకిబ్ కంట్రోల్ తప్పి ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఫాన్స్ కాస్త వెనక్కి తగ్గారు. ఆ వెంటనే మిగిలిన అభిమానులు షకిబ్ నుంచి కాస్త దూరంగా జరిగారు. దీనికి సంబందించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ షకీబ్ పై విమర్శలు చేస్తున్నారు. అభిమానుల్ని కొట్టే సంప్రదాయం మానుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సంచలన తీర్పు.. 11 మంది దోషుల విడుదల చెల్లదు

Exit mobile version