T20 వరల్డ్ కప్ లో తొలిసారిగా సూపర్ 12 రౌండ్లోకి అర్హత సాధించిన జింబాబ్వే…మంచి ఆటతీరును కనబరుస్తోంది. మొన్న ఒక్క పరుగుతో పాకిస్తాన్ ను ఓడించిన జింబాబ్వే…బంగ్లాదేశ్ కు కూడా ముచ్చెమటలు పట్టించింది. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ సాగింది. లాస్ట్ బాల్ కు కూడా హైడ్రామా నడిచింది. ముజరబానీ స్టంపౌట్ అయ్యాడని సెలబ్రేట్ చేసుకుంది బంగ్లా. అయితే థర్డ్ అంపైర్ లో వికెట్ కీపర్, బంతిని వికెట్లను దాటకముందే తీసుకున్నట్లు తేలింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ముజరబానీని నాటౌట్ గా ప్రకటించారు. అప్పటికే పెవిలియన్ చేరుకున్న రెండు జట్లు తిరిగి మళ్లీ క్రీజులోకి వచ్చాయి. లాస్ట్ బాల్ కు 4 పరుగులు కావాల్సిన దశలో మరోసారి ముజరబాని బంతిని మిస్ చేశాడు. దీంతో మూడు పరుగుల తేడా బంగ్లాదేశ్ గెలిచింది.