First Ever Final : భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు సత్తా చాటింది. మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఈవెంట్లో తొలిసారిగా ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో జపాన్ టీమ్‌ను ఇండియా టీమ్ చిత్తుగా ఓడించింది. తద్వారా 3-2 తేడాతో విజయ దుందుభి మోగించింది.
We’re now on WhatsApp. Click to Join
ఇక ఫైనల్లో(First Ever Final) గెలిస్తే టోర్నీ భారత్ సొంతం అవుతుంది. ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఇండియా మహిళల టీమ్ అమీతుమీ తేల్చుకోనుంది. గోల్డ్ మెడలే లక్ష్యంగా సింధు సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ జట్టు ముందుకు సాగుతోంది. కాగా అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్‌పై భారత మహిళా జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే.
Also Read : Prince Harry : నాన్న కోసం ప్రిన్స్ హ్యారీ కీలక నిర్ణయం
అంతకుముందు శుక్రవారం రోజు హాంకాంగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు బృందం 3–0తో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. హాంకాంగ్‌తో తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–7, 16–21, 21–12తో లో సిన్ యాన్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 21–10, 21–14తో యెంగ్ టింగ్–యెంగ్ పుయ్ లామ్ జోడీని ఓడించింది. మూడో మ్యాచ్‌లో అష్మిత 21–12, 21–13తో యెంగ్ సమ్ యీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయం విజయాన్ని అందించింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. ఇవాళ జరిగిన సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ తలపడి గెలవడంతో ఫైనల్‌లోకి ఎంటరైంది.