Site icon HashtagU Telugu

AFG v PAK: స్పీచ్ తో ఆటగాళ్లకు బూస్ట్ ఇచ్చిన కెప్టెన్ బాబర్ అజామ్

AFG v PAK

New Web Story Copy 2023 08 27t183113.693

AFG v PAK: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీల ఆధారంగా 268 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. దీంతో కేవలం 209 పరుగులకే కుప్పకూలింది. వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో కైవసం చేసుకుంది.

మూడో వన్డేలో ఆఫ్ఘనిస్థాన్‌పై 59 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ వన్డే ఫార్మాట్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా అవతరించింది. పాకిస్థాన్ ఆస్ట్రేలియా స్థానాన్ని కొల్లగొట్టింది. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా అవతరించిన తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం పాకిస్థాన్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రేరణాత్మక ప్రసంగం చేస్తూ బాబర్ ఆటగాళ్లందరినీ అభినందించాడు. వన్డేల్లో నెంబర్ వన్ జట్టుగా ఎదిగాం.. కష్టపడి పనిచేసిన ఆటగాళ్లందరికీ ఆ ఘనత దక్కుతుంది.. ఒడిదొడుకులను ఎదుర్కొన్నాం.. అయినా జట్టులో ఐక్యత నిలకడగా నిలిచిందని.. ఈ బంధం వల్లే నంబర్ వన్ అయ్యామని చెప్పాడు.

Also Read: Mumbai: సుశాంత్ ఇంటిలోకి త్వరలోనే ఆదా