Babar Azam:ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.ఓ వైపు ప్రపంచకప్ ఆడుతూనే బాబర్ తన పెళ్లి షాపింగ్ ను పూర్తి చేశాడు. పెళ్లి కోసం ఏకంగా రూ. 7 లక్షలు విలువైన షెర్వాణీని కొనుగోలు చేశాడు. కోల్కతాకు చెందిన ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన షేర్వానీని బాబర్ కొనుగోలు చేశాడంట. అంతేకాకుండా పెళ్లికి సంబందించిన నగలను కూడా కొన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రపంచకప్ లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం ఫర్వాలేదనిపించాడు. ఆడిన 7 మ్యాచ్‌లలో బాబర్ 3 అర్ధ సెంచరీలతో 216 పరుగులు చేశాడు. విశేషం ఏంటంటే బాబర్ ఫిఫ్టీ కొట్టిన ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధించలేదు. ఈ మెగాటోర్నీలో బాబర్ అత్యధిక స్కోర్ 74 పరుగులు.
Also Read: PM Modi: నవంబర్ 7న హైదరాబాద్ కు ప్రధాని మోడీ