Pak vs Ire: చెలరేగిన బాబర్ – రిజ్వాన్.. టీమిండియాకు హెచ్చరికలు

బాబర్ మాట్లాడుతూ.. మా ప్రత్యర్థి భారత్ అని, కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పాడు. దీంతో రానున్న మెగా టోర్నీలో బాబర్ సేన టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజానికి పాకిస్తాన్ భారత్ తో ఆడాలని ఆరాటపడుతుంది

Pak vs Ire: పాకిస్థాన్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ డబ్లిన్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఐర్లాండ్ తరఫున కెప్టెన్ లోర్కాన్ టక్కర్ చెలరేగి ఆడాడు. టక్కర్ 41 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 73 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు ఆండ్రూ బల్బిర్నీ 35 పరుగులు జోడించాడు.

పాకిస్థాన్ కేవలం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్‌ అద్భుత ప్రదర్శనతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. మహ్మద్ రిజ్వాన్ 147 స్ట్రైక్ రేట్ తో 38 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ 42 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. బాబర్‌ అజామ్‌ ఇన్నింగ్స్‌తో బలపడిన పాకిస్థాన్‌ కేవలం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 3 వికెట్లు పడగొట్టాడు.

త్వరలో టి20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పాల్గొనబోతుంది. ఐసీసీ నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ అమెరికా, వెస్టిండీస్ గడ్డపై జరగనుంది. ఇందుకోసం ఆయా జట్లు ఇప్పటికే తమ జట్టు సభ్యుల వివరాలను ప్రకటించాయి. తాజాగా పాకిస్థాన్, టీమిండియా తమ జట్టు సభ్యుల్ని ప్రకటించింది. కాగా ప్రస్తుతం టీమిండియా ఐపీఎల్ టోర్నీ ఆడుతుంది. ఆ వెంటనే టి20 ప్రపంచకప్ లోకి ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఇతర జట్లతో సిరీస్ లు ఆడుతూ ఆ సిరీస్ లను ప్రాక్టీస్ గా మలుచుకుంటుంది. ఇక పాకిస్తాన్ లో బాబర్, రిజ్వాన్ బలమైన బాటర్లుగా రాణిస్తున్నారు. తాజా సిరీస్ చివరి మ్యాచ్ లో ఈ ఇద్దరు తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా పాక్ టీమిండియాకు బలమైన హెచ్చరికలు పంపింది.

తాజాగా బాబర్ మాట్లాడుతూ.. మా ప్రత్యర్థి భారత్ అని, కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పాడు. దీంతో రానున్న మెగా టోర్నీలో బాబర్ సేన టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజానికి పాకిస్తాన్ భారత్ తో ఆడాలని ఆరాటపడుతుంది. గత ప్రపంచకప్ తర్వాత దాయాది దేశాలు మరే టోర్నీలోనూ తలపడలేదు. దాదాపు 7 నెలల తర్వాత ఇరు జట్లు పోటీ పడుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Mulugu: ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ అనుమానాస్పద మృతి