HCA Elections: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇందుకోసం మాజీలు పోటీకి సిద్ధమవుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపాడు. ఎన్నికల్లో గెలిచి హెచ్‌సీఏలో నెలకొన్న అవినీతిని అంతం చేస్తానని స్పష్టం చేశారు అజారుద్దీన్.
గత ఎన్నికల్లో అజారుద్దీన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. మూడు ప్యానల్స్ బరిలోకి దిగినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అజహరుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానళ్ల మధ్యే జరిగింది. అజారుద్దీన్, ప్రశాష్ చందద్ జైన్‌పై 146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 223 ఓట్లు పోలవగా.. అజహర్‌కు 147 ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి ప్రకాశ్ జైన్‌కు 73 ఓట్లు పోలవగా.. మరో అభ్యర్థి దిలీప్ కుమార్‌కు కేవలం 3 ఓట్లు వచ్చాయి.
ఒకప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు. దేశంలో అత్యంత అవినీతి, అసమర్థ క్రికెట్ అసోసియేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. 2019 లో అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన హయాంలో బీసీసీఐ నుంచి 47 కోట్లు వచ్చాయని, అయితే ఆ డబ్బు ఏమైందోనని అప్పట్లో పలువురు ఆరోపించారు. ఇక ఐపీఎల్ లో టికెట్లు అమ్ముకున్నాడని అజారుద్దీన్ పై కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఆయన మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని, గెలిచి హెచ్‌సీఏని అవినీతి నుంచి బయటకు తీసుకొస్తానని చెప్పాడు.
Also Read: Zuckerberg Phone : జుకర్‌బర్గ్ ఫేవరేట్ స్మార్ట్ ఫోన్ ఇదేనట..!