Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్ ఆటగాడు

ప్రస్తుతం పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో మూడో చివరి మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అజర్ అలీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (retirement) ప్రకటించాడు. కరాచీలో ఇంగ్లండ్‌తో తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.

  • Written By:
  • Publish Date - December 16, 2022 / 05:35 PM IST

ప్రస్తుతం పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో మూడో చివరి మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అజర్ అలీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (retirement) ప్రకటించాడు. కరాచీలో ఇంగ్లండ్‌తో తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ రిటైర్మెంట్ (retirement) నిర్ణయం తీసుకున్నాడు.

తన చివరి మ్యాచ్‌ని కరాచీలో ఇంగ్లండ్‌తో ఆడనున్నాడు. టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అజహర్ అత్యున్నత స్థాయిలో తన దేశం తరఫున ఆడడం తనకు దక్కిన గౌరవం, విశేషమని అన్నాడు. ఏ రోజు రిటైర్ అవ్వాలో చెప్పడం చాలా కష్టం. కానీ లోతుగా ఆలోచించిన తర్వాత టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావడానికి ఇదే సరైన సమయమని గ్రహించానని పేర్కొన్నాడు.ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్నఆలీ తాజాగా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చేప్పేశాడు. కరాచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టు అనంతరం టెస్టుల నుంచి తప్పుకోనున్నాడు.

Also Read: World Shortest Man: ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి ఇతనే..!

పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ పాక్ జట్టు తరఫున 96 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 42.5 సగటుతో 7097 పరుగులు చేశాడు. అజహర్ టెస్టుల్లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్ట్ కెరీర్ లో 3 సార్లు డబుల్ సెంచరీ సాధించాడు. అజహర్ కూడా పాక్ తరఫున ఒకసారి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అజహర్ టెస్టులే కాకుండా పాకిస్థాన్ తరఫున వన్డేలు కూడా ఆడాడు. అతను 53 వన్డేల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 3 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 1845 పరుగులు చేశాడు